AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM..

1.సజావుగా కౌంటింగ్… ఈసీకి విపక్షాల డిమాండ్ మే 23న జరిగే ఎన్నికల కౌంటింగ్‌ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష.. నేతలు ఈసీని కలిశారు. ఒక్క పోలింగ్ బూత్‌లోని వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని…Read more 2.‘సైకిల్‌’కు పంక్చర్.. నారా, నందమూరి పార్టీలుగా టీడీపీ టీడీపీ పార్టీ రెండుగా చీలిపోనుందని.. నారా పార్టీ, నందమూరి పార్టీగా విడిపోనుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఈసీపై […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2019 | 5:57 PM

Share

1.సజావుగా కౌంటింగ్… ఈసీకి విపక్షాల డిమాండ్

మే 23న జరిగే ఎన్నికల కౌంటింగ్‌ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష.. నేతలు ఈసీని కలిశారు. ఒక్క పోలింగ్ బూత్‌లోని వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని…Read more

2.‘సైకిల్‌’కు పంక్చర్.. నారా, నందమూరి పార్టీలుగా టీడీపీ

టీడీపీ పార్టీ రెండుగా చీలిపోనుందని.. నారా పార్టీ, నందమూరి పార్టీగా విడిపోనుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఈసీపై అనవసరంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు…Read more

3.ప్రణబ్ దాదా కాంగ్రెస్ మనిషా ? కాషాయధారా..?

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలూ ఈసీపై విమర్శలు కురిపిస్తున్న వేళ..బీజేపీ కనుసన్నుల్లో ఎన్నికల కమిషన్ పని చేస్తోందని…Read more

4.ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోకండి: ప్రియాంక

ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతలా అంటే.. సోమవారం రోజు పార్టీ ప్రధాన కార్యాలయం వెలవెలబోయింది. ఎవరో కొద్దిమంది కార్యకర్తలు మాట్లాడుకుంటూ కనిపించారంతే…Read more

5.అక్రమాస్తుల కేసు: తండ్రీ కొడుకులకు భారీ ఊరట

అక్రమాస్తుల కేసులో తండ్రీ కొడుకులు, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన కేసులో క్లీన్‌చిట్ ఇచ్చింది సీబీఐ. ఈ మేరకు అఖిలేష్, ములాయంలపై…Read more

6.27 అర్ధరాత్రి వరకు ఏపీపై కోడ్ వేటు

ఆంధ్రప్రదేశ్‌‌లో మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయని తెలిపారు...Read more

7.చంద్రబాబుకి చేయిచ్చిన స్వామి

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూటిమిని ఏర్పాటు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ తగిలింది. మొన్నటి వరకు బాబు వెంటే నేను అన్నట్లు ఉన్న కన్నడ సీఎం యూ టర్న్ తీసుకున్నారు. ఇవాళ ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు…Read more

8.డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇదే నా గిఫ్ట్ – ప్రభాస్

‘డార్లింగ్’ ప్రభాస్ నిన్న చెప్పినట్లు గానే ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ముందుకొచ్చాడు. ‘సాహో’ మూవీ లేటెస్ట్ లుక్, రిలీజ్ డేట్‌ను తన ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. కళ్ళజోడు పెట్టుకుని తీక్షణంగా చూస్తున్న ప్రభాస్ లుక్ హాలీవుడ్…Read more

9.పార్టీలు విజయోత్సవాలను నిర్వహించరాదు: సీపీ

ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఏవైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు…Read more

10.‘బిగ్‌బాస్ 3’ కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ఉదయభాను, గుత్తా జ్వాలా..?

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో యాంకర్ ఉదయ బాను, నటి శోభితా దూళిపాళ…Read more