సెన్సెక్స్ సీన్ రివర్స్!

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల నేపథ్యంలో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు.. నేడు నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కొన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయింది. సోమవారం నాటి జోరుతో దేశీయ మార్కెట్లు ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లి సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా 50 […]

సెన్సెక్స్ సీన్ రివర్స్!
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 5:51 PM

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల నేపథ్యంలో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు.. నేడు నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కొన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయింది.

సోమవారం నాటి జోరుతో దేశీయ మార్కెట్లు ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లి సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా 50 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ జోరును సూచీలు కొనసాగించలేకపోయాయి. కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీలు లాభాలను కోల్పోయాయి. మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు అంతకంతకూ పతనమవుతూ వచ్చాయి. చివరకు నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లు దిగజారి 38,969 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో 11,709 వద్ద ముగిశాయి.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..