ఈయనే బల్లాల దేవుడంటే నమ్మలేం.. అసలు రానాకు ఏమైంది?
బహుబలి మూవీలో హీరో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్‌కి ఎంత పేరు వచ్చిందో .. విలన్ బల్లాల దేవుడి పాత్రలో రానాకు కూడా అంతే పేరు వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీనుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన కనిపించడం మానేశారు. తన టాలెంట్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా ఏకంగా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే […]
బహుబలి మూవీలో హీరో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్‌కి ఎంత పేరు వచ్చిందో .. విలన్ బల్లాల దేవుడి పాత్రలో రానాకు కూడా అంతే పేరు వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీనుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన కనిపించడం మానేశారు. తన టాలెంట్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా ఏకంగా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే రానా గత కొంతకాలంగా మూవీలకు దూరంగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన విదేశాల్లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్ననంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వస్తున్నాడు. తాజాగా రానా పోస్ట్ చేసిన ఫోట్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసినవారంతా షాక్ అవుతున్నారు . బాహుబలి మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపంచిన బల్లాలదేవుడు .. ఇంతగా చిక్కిపోడానికి కారణం ఏమిటో అని నెటిజన్లు, రానా అభిమానులు బాధపడుతున్నారు.
రానా చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో కనిపించాడు. ఆ తర్వాత నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రానా పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోపై ఎన్నో ఆయన అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయగంగా దగ్గుబాటి కుటుంబమే అసలు విషయాన్ని వెల్లడిస్తే తప్ప ఎవ్వరికీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం రానా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ సినిమాను పూర్తి చేయాల్సింది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. ఇక రానా నటించిన హిందీ మూవీ హౌస్‌ఫుల్ 4 అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కండలు తిరిగిన శరీరంతో టాలీవుడ్ కండల వీరుడిగా పేరుగాంచిన రానా దగ్గుబాటి మళ్లీ అదే రూపంలో ఎప్పుడు కనిపిస్తాడోనంటూ సినీజనం ఆశగా చూస్తున్నారు.