లొంగిపోయిన కోడెల శివరాం

కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే శివరాంపై నమోదైన ఐదు కేసుల విషయంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు శివారంను లొంగిపోవాలని సూచించింది. ఈ సందర్భంగా మంగళవారం నరసరావుపేట ఫస్ట్ మున్సీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో […]

లొంగిపోయిన కోడెల శివరాం
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 4:29 PM

కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే శివరాంపై నమోదైన ఐదు కేసుల విషయంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు శివారంను లొంగిపోవాలని సూచించింది. ఈ సందర్భంగా మంగళవారం నరసరావుపేట ఫస్ట్ మున్సీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన లొంగిపోయారు.

తన తండ్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య సమయంలో కుమారుడు శివరాం విదేశాల్లో ఉన్నారు. ఏపీ అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌ను శివరాం తన షోరూమ్‌లో ఉంచడంపై కూడ ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గుంటూరు జిల్లాలో కే ట్యాక్స్ పేరిట భారీస్థాయిలో అక్రమంగా సొమ్ములు వసూలు చేశారని, పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిపారనే ఆరోపణలు సైతం శివరాంపై ఉన్నాయి. టీడీపీ ఉన్నంతకాలం బయటకు రాని బాధితులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కక్కొరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కోడెల శివరాంపై పలు కేసులు నమోదయ్యాయి.