బుల్లితెర కురిపిస్తున్న కాసులు.. యాంకర్లు జిగేల్.. జిగేల్!

బుల్లితెరలో టాప్ యాంకర్ ఎవరంటే.. తడుముకోకుండా సుమ కనకాల అని అందరూ చెబుతారు. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడటమే కాకుండా తన మాటల తూటాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఇలా సుమ కోవలోనే అనసూయ, రష్మీ, మంజూష, ఝాన్సీ, శ్రీముఖి తదితరులు బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్నారు. ఇక వీరి రెమ్యునరేషన్ తక్కువ ఉంటుందని అనుకుంటే పొరపాటే.. సినిమాల్లో నటించే హీరోయిన్ల కంటే వీళ్ళ సంపాదనే ఎక్కువగా ఉంటుంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం. […]

  • Updated On - 9:36 pm, Tue, 12 November 19 Edited By: Pardhasaradhi Peri
బుల్లితెర కురిపిస్తున్న కాసులు.. యాంకర్లు జిగేల్.. జిగేల్!

బుల్లితెరలో టాప్ యాంకర్ ఎవరంటే.. తడుముకోకుండా సుమ కనకాల అని అందరూ చెబుతారు. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడటమే కాకుండా తన మాటల తూటాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఇలా సుమ కోవలోనే అనసూయ, రష్మీ, మంజూష, ఝాన్సీ, శ్రీముఖి తదితరులు బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్నారు. ఇక వీరి రెమ్యునరేషన్ తక్కువ ఉంటుందని అనుకుంటే పొరపాటే.. సినిమాల్లో నటించే హీరోయిన్ల కంటే వీళ్ళ సంపాదనే ఎక్కువగా ఉంటుంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం. మరి లేట్ ఎందుకు ఒకసారి వారి పారితోషికాలు ఎంతెంతో తెలుసుకుందాం..

సుమ:

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ.. ఎప్పటికీ నెంబర్ వన్ యాంకర్ సుమ కనకాల. బుల్లితెరపై పలు షోస్ చేయడమే కాకుండా.. దాదాపు అన్ని సినిమా ఫంక్షన్లకు కూడా సుమనే యాంకరింగ్ చేస్తుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు నుంచి రౌడీ విజయ్ దేవరకొండ వరకు సుమను ఉద్దేశించి ‘మీరు ఫంక్షన్‌లో ఉంటే.. మాకు అదొక బలం అంటూ పొగిడిన సందర్భాలు ఎన్నో’ ఉన్నాయి.

సుమ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. రియాలిటీ షోస్, ఆడియో ఫంక్షన్స్‌కు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు పారితోషికం పుచ్చుకుంటుందని సమాచారం. అయితే అవార్డు ఫంక్షన్స్‌కు మాత్రం అటూ ఇటుగా 3 లక్షలు దాటి ఉంటుందని ఇన్‌సైడ్ టాక్.

అనసూయ:

జబర్దస్త్ షోతో తెగ పాపులార్టీ తెచ్చుకుంది నటి అనసూయ. తన గ్లామర్‌తో కుర్రాళ్ళ మతులు పోగొట్టే రంగమ్మత్త ఒక్కో ఈవెంట్‌కు రూ.2 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ఈమె ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

రష్మీ:

బుల్లితెరపై యాంకర్ రష్మీ క్రేజ్ అంతా ఇంతా కాదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి రష్మీ పలు షోస్ చేస్తే చాలు.. అవి సూపర్ డూపర్ హిట్ సాధించడం పక్కా. అటు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో హంగామా చేస్తున్న ఈ యాంకరమ్మ దాదాపు లక్షన్నరపైనే రెమ్యునరేషన్ తీసుకునేది.. అయితే పలు సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు.. పారితోషికాన్ని డబుల్ చేసిందని వినికిడి.

శ్రీముఖి:

బిగ్ బాస్ షోతో శ్రీముఖి రేంజ్ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు. ఈ రియాలిటీ షో కోసం ఏకంగా రూ.1.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుందని టాక్ వినిపిస్తుండగా.. ఇప్పుడు ఆమె షోస్, వేడుకల్లో కనిపించాలంటే తప్పకుండా అధిక పారితోషికం ఇవ్వాల్సిందే.

ఇక మంజూష, వర్షిణి, విష్ణుప్రియ వంటి యాంకర్లు రూ.50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హీరోయిన్ల కంటే మన తెలుగింటి యాంకర్లే రెండు చేతులా భారీగా సంపాదిస్తున్నట్లు చెప్పాలి.