కొత్తపెళ్లికొడుకు చిట్కాలు

టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే ఊపులో బ్యాక్ టు వర్క్ అంటూ సినిమా షూట్ లకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్‌ యాక్టివిటీపై దృష్టి పెట్టి..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 2:52 pm, Wed, 26 August 20
కొత్తపెళ్లికొడుకు చిట్కాలు

టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే ఊపులో బ్యాక్ టు వర్క్ అంటూ సినిమా షూట్ లకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్‌ యాక్టివిటీపై దృష్టి పెట్టి వర్కౌట్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నితిన్.. కోచ్ వంశీ గైడెన్స్ లో కసరత్తులు చేస్తున్నానని చెబుతూ.. మూడున్న‌ర నిమిషాల్లో 500 జంప్ రోప్స్ చేశానని తెలిపాడు. స్కిప్పింగ్‌ తో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని.. వ్యాయామం, పౌష్టికాహారం వల్ల రోగ నిరోధక శక్తి ఇనుమడిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకి అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనితోపాటు మేర్ల‌పాక గాంధీ, చంద్ర‌శేఖ‌ర్ యేలేటి, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో కూడా నితిన్ సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి.