మరో ఓ విలక్షణ పాత్రలో అల్లరి నరేష్.. ‘నాంది’ పోస్టర్స్ మామూలుగా లేవుగా..

అల్లరి నరేష్ మళ్లీ ఓ విలక్షణ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న అల్లరి నరేష్ చడీ చప్పుడు కాకుండా ఓ సినిమా పూర్తి చేసుకున్నాడు. తన 57వ చిత్రంగా 'నాంది' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో తనంటే నిరూపించుకున్న అల్లరోడు..

మరో ఓ విలక్షణ పాత్రలో అల్లరి నరేష్.. 'నాంది' పోస్టర్స్ మామూలుగా లేవుగా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 28, 2020 | 8:32 PM

అల్లరి నరేష్ మళ్లీ ఓ విలక్షణ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న అల్లరి నరేష్ చడీ చప్పుడు కాకుండా ఓ సినిమా పూర్తి చేసుకున్నాడు. తన 57వ చిత్రంగా ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో తనంటే నిరూపించుకున్న అల్లరోడు.. మరోసారి ఓ ఇంట్రస్టింగ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అల్లరి నరేష్ హీరోగా.. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూన్ 30న నరేశ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ అంటే చిన్నపాటి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ ఫస్ట్ లుక్‌లో నరేష్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనిపించాడు. పోలీస్ స్టేషన్ బట్టలు లేకుండా నగ్నంగా ఆందోళనగా కూర్చొని ఉండటం పోస్టర్‌లో చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ప్రవీణ్, హరీష్ లుక్‌లను కూడా కాసేపటి క్రితమే చిత్ర బృందం రిలీజ్ చేసింది. వీరితో పాటు ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రియదర్శి, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.

Read More:

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..