AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి వనితా విజయ్‌కుమార్‌, ఆమె భర్తపై కేసు నమోదు..!

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్‌ శనివారం సినీ పరిశ్రమకు చెందిన పీటర్‌ పాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే

నటి వనితా విజయ్‌కుమార్‌, ఆమె భర్తపై కేసు నమోదు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2020 | 8:43 PM

Share

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్‌ శనివారం సినీ పరిశ్రమకు చెందిన పీటర్‌ పాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వనితాకు ఇది మూడో పెళ్లి కాగా.. పీటర్‌ పాల్‌కి రెండో వివాహం. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో క్రైస్తవ పద్దతిలో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమంలో వనితా కుమార్తెలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇక వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్‌ హెలెన్‌ ఈ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనతో విడాకులు తీసుకోకుండానే పీటర్, వనితాను వివాహం చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు టాక్‌. కాగా ఈ నెల 18న తాను పీటర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వనితా ఓ ప్రకటనను విడుదల చేశారు. తనను జీవితాంతం అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడని, తన పెళ్లికి కుమార్తెలు సంతోషంగా ఒప్పుకున్నారని ఆమె తన ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే.

Follow Us
గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ!
గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ!
మహానంది ఆలయంలో నాగుపాము ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..
మహానంది ఆలయంలో నాగుపాము ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..
సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
'ఇరుముడి'తో రవితేజకు జాక్ పాట్.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో...
'ఇరుముడి'తో రవితేజకు జాక్ పాట్.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో...
వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!
వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!
వికెట్ తీశాక ఓవరాక్షన్.. లంక బౌలర్‌ దూల తీర్చిన జైస్వాల్
వికెట్ తీశాక ఓవరాక్షన్.. లంక బౌలర్‌ దూల తీర్చిన జైస్వాల్
ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు
ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు
ఆద్యంతం ఆసక్తిని పెంచే సినిమా..
ఆద్యంతం ఆసక్తిని పెంచే సినిమా..
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆరోగ్య శ్రీలోకి అదనపు చికిత్సలు!
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆరోగ్య శ్రీలోకి అదనపు చికిత్సలు!
ఫేమస్ ఫుడ్.. మటన్ బోటిలో ఇదొక్కటి వేశారంటే డబుల్ స్టామినా..
ఫేమస్ ఫుడ్.. మటన్ బోటిలో ఇదొక్కటి వేశారంటే డబుల్ స్టామినా..