బిగ్‌ సర్‌ప్రైజ్: ఈ రోజే రానా, మిహీకాల నిశ్చితార్థం

యంగ్ హీరో రానా, మిహీకాల ప్రేమ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు ప్రొడ్యూసర్ సురేష్ దగ్గుబాటి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో సినీ అభిమానులకు మరో బిగ్‌ సర్‌ప్రైజ్..

బిగ్‌ సర్‌ప్రైజ్: ఈ రోజే రానా, మిహీకాల నిశ్చితార్థం

యంగ్ హీరో రానా, మిహీకాల ప్రేమ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు ప్రొడ్యూసర్ సురేష్ దగ్గుబాటి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో మరో బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది దగ్గుబాటి ఫ్యామిలీ. రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఎప్పుడనేది ఫైనల్‌గా చెప్పేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగబోతుంది. వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరు కాబోతున్నారని సమాచారం.

కాగా ఈ నెల 12న అందరికీ షాక్ ఇస్తూ.. తాను ప్రేమించిన అమ్మాయి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు రానా. తన ప్రియురాలు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. తన ప్రపోజల్‌కి ఆమె అంగీకరించినట్టు’.. ట్వీట్ చేశాడు రానా. ఈ పోస్ట్‌తో అటు సెలబ్రిటీలకు, ఇటు అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే మరో షాక్‌ ఇస్తూ.. రానా తండ్రి సురేష్ బాబు వీరి పెళ్లి ఎప్పుడనే సస్పెన్స్‌ను కూడా తొలగించారు.

రానా, మిహీకాల పెళ్లి డిసెంబర్‌లో చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వీరిద్దరూ చాలా కాలం నుంచి ఒకరికొకరు తెలుసని, వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషమన్నారు సురేష్ బాబు. వీరి పెళ్లి డిసెంబర్ లేదా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో.. లాక్‌డౌన్‌లోనే రానా, మిహీకాల ఎంగేజ్‌మెట్ జరుగుతుండటం సినీ అభిమానులను షాక్‌కి గురి చేస్తోంది

ఇది కూడా చదవండి: 

టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్‌‌న్యూస్.. బిట్ పేపర్ తొలగింపు

షాకింగ్ న్యూస్.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి