ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. బిట్ పేపర్ తొలగింపు

పదో తరగతి విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించే పరీక్షల్లో బిట్ పేపర్ తొలగించింది ప్రభుత్వం. కాగా ఇదివరకే బిట్ పేపర్ తొలగిస్తామని ఏపీ ప్రభుత్వం..

  • Tv9 Telugu
  • Publish Date - 8:04 am, Wed, 20 May 20

పదో తరగతి విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించే పరీక్షల్లో బిట్ పేపర్ తొలగించింది ప్రభుత్వం. కాగా ఇదివరకే బిట్ పేపర్ తొలగిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 2019-2020 విద్యా సంవత్సరం మొదట్లోనే ఇంటర్నల్ మార్కులు, బిట్‌పేపర్‌ను తొలగించింది. ప్రతీ సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలు ఉండేలా మార్పులు చేస్తామన్నారు. తాజాగా కరోనా కారణంగా 11 ప్రశ్నా పత్రాలను కూడా ఆరింటికి కుదించింది ఏపీ ప్రభుత్వం.

ఇప్పటివరకూ టెన్త్ విద్యార్థులు 11 ప్రశ్నా పత్రాలతోనే అంతర్గత పరీక్షలు రాశారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో వాటిని ఆరు పేపర్లకే కుదించారు. కాగా దీనిపై పలువురు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్యను కాకుండా మార్కులను మాత్రమే పెంచారు. 50 మార్కులు వంద అయ్యాయి. పరీక్ష వ్యవధి లోగడ 2.45 గంటలు ఉండేది దాన్ని అరగంట పెంచడం విద్యార్థులకు కలసివచ్చేదేనని కొందరు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: 

బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి