Rashmika Mandanna: అయ్యా బాబోయ్.. రష్మికలో ఈ టాలెంట్ కూడా ఉందా..? నేషనల్ క్రష్ వీడియో వైరల్..

ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. అయితే నటనపరంగానే కాకుండా రష్మికలో మరో టాలెంట్ ఉంది.

Rashmika Mandanna: అయ్యా బాబోయ్.. రష్మికలో ఈ టాలెంట్ కూడా ఉందా..? నేషనల్ క్రష్ వీడియో వైరల్..
Rashmika Mandanna
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:45 PM

యానిమల్ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో శ్రీవల్లి.. యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రలతో సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లోనూ నటిస్తుంది. ఇవే కాకుండా కుబేర సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యింది రష్మిక. ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. అయితే నటనపరంగానే కాకుండా రష్మికలో మరో టాలెంట్ ఉంది.

రష్మిక పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో నేషనల్ క్రష్ ఆమ్లెట్ వేస్తూ కనిపించింది. ఆమ్లెట్ తయారుచేసే విధానాన్ని వివరిస్తానని చెబుతూ వీడియోను ప్రారంభించింది. నువ్వుల నూనె, నెయ్యి, బచ్చలికూర, పుట్టగొడుగులు టెరియాకి సాస్ వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆమ్లెట్ వేసింది. ఆమ్లేట్ ఎలా వేయాలో చెబుతూ వీడియోను షేర్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నేషనల్ క్రష్ వంట చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

రష్మిక మందన్న ఆమ్లెట్ రెసిపీ చాలా సులభం. ఒక బాణలిలో నువ్వుల నూనె వేసి, మష్రూమ్, టెరియాకి సాస్‌తో పాటు తరిగిన బచ్చలికూరను జతచేయాలి. మిశ్రమాన్ని రెండు నిమిషాలు ఉడికించాలి. గుడ్డులోని తెల్లసొనను తీసి పక్కనపెట్టాలి. డిచేసిన పాన్‌లో కొంచెం నెయ్యి, గుడ్డు సోన వేసి ఉప్పు, కారం పొడి వేయాలి. కూరగాయల మిశ్రమాన్ని ఆమ్లెట్ మీద వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles