వీరివీరి గుమ్మడి పండు.. ఎవరు ఈ దోర జామపండు..? చెప్పుకోండి చూద్దాం.!!

కొంతమంది మాత్రం ఒక్క హిట్ పడకపోయినా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగే ఈ నటి ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తల్లితో పాటు ఫొటోకు ఫోజ్ ఇచ్చిన ఈ చిన్నారి..

వీరివీరి గుమ్మడి పండు.. ఎవరు ఈ దోర జామపండు..? చెప్పుకోండి చూద్దాం.!!
Actress
Follow us

|

Updated on: May 14, 2024 | 1:20 PM

సినిమాల్లో హీరోయిన్స్ గా రాణించడం నిజంగా చాలా కష్టం.. అందం అభినయం ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది హీరోయిన్స్ తమ టాలెంట్ చూపించినా కూడా ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం ఒక్క హిట్ పడకపోయినా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగే ఈ నటి ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తల్లితో పాటు ఫొటోకు ఫోజ్ ఇచ్చిన ఈ చిన్నారి.. మన దగ్గర చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

పై ఫొటోలో తల్లితో కలిసి ఉన్న ఆ చిన్నారి మరెవరో కాదు.. క్యూట్ నెస్ తో కవ్వించే నివేదా పేతురాజ్. తమిళ, తెలుగు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో మెంటల్ మదిలోఅనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది నివేదా పేతురాజ్. ఆతర్వాత చిత్రలహరి సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అలాగే బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్‌ కా ధమ్కీ, సినిమాల్లో నటించింది. దాస్‌ కా ధమ్కీ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది. అయితే ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో ఈ అమ్మడు సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఒక్క సినిమా పడితే తానేంటో చూపిస్తా అంటుంది ఈ వయ్యారి భామ.

నివేదా పేతురాజ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

నివేదా పేతురాజ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.