Sweet Corn: స్వీట్ కార్న్ తింటే శరీరంలో జరిగే మ్యాజిక్స్ ఇవే..!

స్వీట్ కార్న్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. సాధారణంగా స్వీట్ కార్న్‌ను బయట షాపింగులకు వెళ్లినప్పుడు, షికార్లకు, పార్కులకు వెళ్లినప్పుడు తింటూ ఉంటారు. అదే విధంగా అప్పుడప్పుడూ ఇంట్లో కూడా తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. వీటిని ఏదో రుచి కోసం తింటున్నాం..

Sweet Corn: స్వీట్ కార్న్ తింటే శరీరంలో జరిగే మ్యాజిక్స్ ఇవే..!
Sweet Corn
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 15, 2024 | 4:31 PM

స్వీట్ కార్న్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. సాధారణంగా స్వీట్ కార్న్‌ను బయట షాపింగులకు వెళ్లినప్పుడు, షికార్లకు, పార్కులకు వెళ్లినప్పుడు తింటూ ఉంటారు. అదే విధంగా అప్పుడప్పుడూ ఇంట్లో కూడా తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. వీటిని ఏదో రుచి కోసం తింటున్నాం అనుకుంటే మాత్రం పొరపాటే. స్వీట్ కార్న్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిల్లో అనేక రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్వీట్ కార్న్ ప్రస్తుతం అన్ని సీజన్లలో కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఈ స్వీట్‌ కార్న్ మీ డైట్‌లో తరచూ చేర్చుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూసేయండి.

ఫుల్‌గా పోషకాలు:

స్వీట్ కార్న్‌లో మంచి కొవ్వు పదార్థాలు, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, జింక్ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభ్యమవుతాయి.

చర్మం – జుట్టు ఆరోగ్యం:

స్వీట్ కార్న్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి కాబట్టి.. మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తరచూ తింటే వృద్ధాప్యం త్వరగా దరి చేరకుండా ఉంచుతుంది. చర్మం క్లియర్‌గా, కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అంతే కాకుండా స్వీట్ కార్న్ తినడం వల్ల జుట్టు కూడా బలంగా, దృఢంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గ్లూటన్ ఫ్రీ ఫుడ్:

చాలా మంది కొన్ని రకాల ఫుడ్స్ పడవు. గోధుమ పిండి తింటే చాలా మందికి అలర్జీ సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి స్వీట్ కార్న్, కార్న్ ఫ్లోర్ బెస్ట్ ఆప్షన్. స్వీట్ కార్న్ గ్లూటన్ ఫ్రీ ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

స్వీట్ కార్న్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభ్యమవుతాయి. కాబట్టి ఇది తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అలాగే స్వీట్ కార్న్ తిడనం వల్ల తక్షణమే శక్తి అందుతుంది. దీంతో అలసట, నీరసం దూరం అవుతాయి.

వెయిట్ లాస్:

బరువు తగ్గాలి అనుకునేవారు స్వీట్ కార్న్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. దీంతో కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇతర ఆహారాలు మళ్లీ తినాలనిపించదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇది తింటే.. బరువు తగ్గడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
బరితెగించిన కీచక అధికారి.. వీడియో తీసి పైశాచిక ఆనందం..!
బరితెగించిన కీచక అధికారి.. వీడియో తీసి పైశాచిక ఆనందం..!
సూర్యవంశం సినిమాలో వెంకటేశ్ కొడుకు గుర్తున్నాడా..?
సూర్యవంశం సినిమాలో వెంకటేశ్ కొడుకు గుర్తున్నాడా..?
రూ. 7 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 7 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్
డార్లింగ్ స్పీచ్ విని ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్.. పెళ్లిపై ఏమన్నారంటే
డార్లింగ్ స్పీచ్ విని ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్.. పెళ్లిపై ఏమన్నారంటే
తెలంగాణ ఆర్టీసీ లోగో మారిందా.? క్లారిటీ ఇచ్చిన సజ్జనార్‌..
తెలంగాణ ఆర్టీసీ లోగో మారిందా.? క్లారిటీ ఇచ్చిన సజ్జనార్‌..
ప్రశాంత్ నీల్ అప్‌డేట్‌తో తేలిపోతున్న తారక్ ఫ్యాన్స్
ప్రశాంత్ నీల్ అప్‌డేట్‌తో తేలిపోతున్న తారక్ ఫ్యాన్స్
మీ శరీరం అన్ని సమయాలలో వేడిగా ఉంటుందా..? వామ్మో.. పెను ప్రమాదమే..
మీ శరీరం అన్ని సమయాలలో వేడిగా ఉంటుందా..? వామ్మో.. పెను ప్రమాదమే..
కాకిని చీప్‌గా చూడకండి.. దాని లక్షణాలు ఫాలో అయితే
కాకిని చీప్‌గా చూడకండి.. దాని లక్షణాలు ఫాలో అయితే
'బహువచనం అంటే.. అత్తమామల మాటవినే కోడలు' పరీక్షలో విద్యార్ధి జవాబు
'బహువచనం అంటే.. అత్తమామల మాటవినే కోడలు' పరీక్షలో విద్యార్ధి జవాబు
సుప్పిని ..సుద్దపూసని అని అడ్డంగా బుక్కయింది.. అందుకే..?
సుప్పిని ..సుద్దపూసని అని అడ్డంగా బుక్కయింది.. అందుకే..?