28 April 2024
యంగ్ హీరోకు జోడిగా వర్ష బొల్లమ్మ.. ఏ సినిమా అంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే క్రేజ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ఇటీవలే ఊరు పేరు భైరవకొన చిత్రంలో నటించింది.
తాజాగా మరో ఛాన్స్ కొట్టేసింది ఈ వయ్యారి. యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా తమ్ముడు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది.
ఈ సినిమాలో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుంది. ఇక ఇందులో వర్ష బొల్లమ్మ కూడా మరో హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.
వర్ష బొల్లమ్మ కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి ఆశించిన స్తాయిలో గుర్తింపు రాలేదు.
టిక్ టాక్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన వర్ష.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టింది.
వర్ష బొల్లమ్మ మలయాళీ హీరోయిన్ నజ్రీయాలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నితిన్ సరసన తమ్ముడు సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.