కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో శిశు ముద్ర రుణాలు ఒకటి. దానిపై కేంద్రం వడ్డీ 2 శాతం..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 10:04 AM

లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో శిశు ముద్ర రుణాలు ఒకటి. దానిపై కేంద్రం వడ్డీ 2 శాతం తగ్గింపు కూడా ప్రకటించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది. అసలు ఇంతకీ శిశు ముద్ర రుణం అంటే ఏంటి? అనే డౌట్ వచ్చింది కదా. తక్కువ పెట్టుబడితో మీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ లోన్ తీసుకోవచ్చు. ఇది ప్రధాన్ మంత్రి ముద్ర యోజనలో ఒక భాగం. పీఎం ముద్ర యోజన కింద మూడు రకాల రుణాలు ఉన్నాయి. అందులో శిశు ముద్ర లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్ అనే ముడు రకాల పథకాలున్నాయి.

ఒకవేళ మీరు చిన్న మొత్తంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ శిశు ముద్రా లోన్ చక్కగా సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా మీరు రూ.50 వేలు తీసుకుని బిజినెస్‌ని ప్రారంభించవచ్చు. దీనిపై ప్రభుత్వం స్వావలంబన భారత ప్రచారం కింద 2 శాతం సబ్సీడీ కూడా ఇస్తుంది. ఈ రుణాన్ని 3 కోట్ల మంది 12 నెలల కాల వ్యవధితో దీనిని పొందవచ్చు. ఈ రుణం తీసుకునే వారికి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల వడ్డీని కూడా చెల్లిస్తుంది. ఈ రుణ పథకం మొక్క ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే.. చిన్న తరహా వ్యాపారులను ప్రేరేపించడం, సహాయం చేయడం.

ఈ లోన్‌ తీసుకునేందుకు మీరు పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం కూడా లేదు. మీకు దగ్గరలో ఉన్న వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్‌బి), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్‌ఐలు, ఎన్‌బిఎఫ్‌సిల ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ రుణాన్ని పొందడానికి ఎటువంటి హామీ అవసరం లేదు. ఈ పథకం 2015వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభమైంది. మరిన్ని వివరాలకు https://www.udyamimitra.in/ని సందర్శించండి.