AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Lasya: స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుందంటూ ఎమోషనల్

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాధం నెలకొంది. ఈమేరకు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక ఎమోషనల్ పోస్ట్‌ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు యాంకర్ లాస్య మంజునాథ్ కు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ కోరుతున్నారు.

Anchor Lasya: స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుందంటూ ఎమోషనల్
Anchor Lasya
Basha Shek
|

Updated on: Apr 28, 2024 | 5:52 PM

Share

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాధం నెలకొంది. ఈమేరకు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక ఎమోషనల్ పోస్ట్‌ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు యాంకర్ లాస్య మంజునాథ్ కు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ కోరుతున్నారు. లాస్య భర్త మంజునాథ్ తండ్రి హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిందామె. ‘మిస్ యూ అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా మామతో దిగిన కొన్ని ఫొటోలను కూడా అందులో షేర్ చేసింది. ఇకలాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి మరణంపై ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తండ్రితో దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చారు మంజునాథ్.

ప్రస్తుతం లాస్య దంపతుల పోస్టులు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అయితే తన మామ మృతికి గల కారణాలను లాస్య వెల్లడించలేదు. మంజునాథ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోయాడు. అంతేకాదు ఇద్దరూ తమ ఇన్ స్టాగ్రామ్ పోస్టులకు కామెంట్ సెక్షన్ సైతం ఆఫ్ చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. లాస్య, మంజునాథ్ దంపతులకు ధైర్యం చెబుతూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లాస్య, మంజునాథ్ లది ప్రేమ వివాహం. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో 2017లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో స్టార్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన లాస్య ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమైంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. అలాగే ఆమెకు ఒక సొంత యూట్యూబ్‌ చానెల్‌ ఉంది. అందులో పలు వీడియోలు అప్లోడ్‌ చేస్తూ ఫ్యాన్స్ ను పలకరిస్తుంటుంది.

లాస్య, మంజునాథ్ ల ఎమోషనల్ పోస్ట్..

ఇద్దరు కుమారులతో యాంకర్ లాస్య… వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పులు తీర్చేందుకు తండ్రికే కిడ్నాప్ డ్రామా..!
అప్పులు తీర్చేందుకు తండ్రికే కిడ్నాప్ డ్రామా..!
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!
ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు
ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!