దేశంలో ఏ రాష్ట్రానికి ఎంత తీర ప్రాంతం ఉందంటే.?

TV9 Telugu

27 April 2024

గుజరాత్ రాష్ట్రంలో దేశంతో అతి ఎక్కువ సముద్ర తీరా ప్రాంతం కలిగి ఉంది. ఇది మొత్తం 1214.7 కిలోమీటర్లు ఉంది.

ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రానికి ఉన్న తీరం 973.7 కి. మీ.

సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో 906.9 కిలోమీటర్లతో దేశంలో మూడో స్థానంలో ఉంది తమిళనాడు రాష్ట్రం.

కేరళను దేవతల భూమిగా పిలుస్తారు. ఈ సుందరమైన రాష్ట్రంలో 569.7 కిలోమీటర్ల సి షోర్ ఉంది. ఇది నాలుగో తీర ప్రాంతం రాష్ట్రం.

జగన్నాథుడి నేల ఒడిశా రాష్ట్రం మొత్తం 476.4 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉంది. ఈ రాష్ట్రానిది ఐదో స్థానం.

శ్రీ కృష్ణ దేవరాయలు ఏలిన గడ్డ కర్ణాటక రాష్ట్రం మొత్తం 280 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది.ఈ రాష్ట్రాన్ని ఐటీ క్యాపిటల్ అఫ్ ఇండియా అంటారు.

గోవా 160.5 కిలోమీటీర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. అయితే ఇది కేంద్రపాలిత ప్రాంతం డామన్ & డయ్యూ తో కలుపుకొని ఉంది.

కాళీ నిలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 157.5 కి. మీ. తీర ప్రాంతం ఉంది. ఇదే దేశంలో అతి తక్కువ తీరం కలిగి ఉన్న రాష్ట్రం.

యూనియన్ టెరిటరీలైన అండమాన్ & నికోబార్ దీవులు 1962.0 కి.మీ., లక్షదీప్ దీవులు 132.0 కి.మీ., పుదుచ్చేరి 30.6 కి.మీ. తీర ప్రాంతం కలిగి ఉన్నాయి.