Tollywood: ఆ హీరోయిన్ కోసం రెండేళ్లు వెయిట్ చేసిన డైరెక్టర్.. చివరకు ఏం జరిగిందంటే..

హిందీలో అద్భుతమైన చిత్రాలను అందించిన ఆయన.. సినీ పరిశ్రమలోని ప్రతి స్టార్ తో కలిసి పనిచేయాలనుకున్నాడట. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, షారుఖ్ ఖాన్, అలియా భట్ వంటి స్టార్స్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సంజయ్.. ఓ హీరోయిన్ కోసం ఏకంగా రెండేళ్లు వెయిట్ చేశాడట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ?.

Tollywood: ఆ హీరోయిన్ కోసం రెండేళ్లు వెయిట్ చేసిన డైరెక్టర్.. చివరకు ఏం జరిగిందంటే..
Actress 1
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:27 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. హిందీలో అనేక పీరియాడికల్ డ్రామాలను రూపొందించి అత్యధిక వసూళ్లు రాబట్టారు. ఇక ఇప్పుడు ‘హిరామండి: ది డైమండ్ బజార్’ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ తో ఓటీటీలోకి అరంగేట్రం చేస్తున్నాడు సంజయ్. హిందీలో అద్భుతమైన చిత్రాలను అందించిన ఆయన.. సినీ పరిశ్రమలోని ప్రతి స్టార్ తో కలిసి పనిచేయాలనుకున్నాడట. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, షారుఖ్ ఖాన్, అలియా భట్ వంటి స్టార్స్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సంజయ్.. ఓ హీరోయిన్ కోసం ఏకంగా రెండేళ్లు వెయిట్ చేశాడట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ?.. తనే మాధురీ ధీక్షిత్.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ కలిసి నటించిన సినిమా దేవదాస్. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కానీ అంతకుముందే మాధురికి రెండు సినిమాలను ఆఫర్ చేశాడట. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘ఖామోషి: ది మ్యూజికల్’ చిత్రాల కోసం మాధురీని సెలక్ట్ చేశాడట. పిటిఐకి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో, భన్సాలీ ఈ రెండు చిత్రాల కోసం తనను ఒప్పించలేకపోయానని, దాని కోసం బాధపడ్డానని చెప్పాడు.

“ఖామోషి నుండి, ప్రతి చిత్రంలో మాధురిని డైరెక్ట్ చేయాలనుకున్నాను. ఇండస్ట్రీలో ఎవరినీ ఆమె స్థానం కోసం ఎంపిక చేయలేకపోయాను. ‘ఖామోషి’ కోసం 2.5 ఏళ్లుగా మాధురి కోసం వెయిట్ చేశాను. చాలాసార్లు ఆమెను స్క్రిప్ట్ చదవాలని అడిగాను. కానీ ఆ రెండు సినిమాల్లో ఆమె నటించలేదు. దీంతో మాధురి లేకుండానే ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కచ్చితంగా ‘దేవదాస్‌’లో ఆమె నటించేలా చేయాలని నిర్ణయించుకున్నాను” అని అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన హీరామండి సినిమాలో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, శేఖర్ సుమన్, తాహా షా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అందుకోసం పాదయాత్ర చేస్తా.. బీజేపీ అభ్యర్థి మాధవీలత కీలక ప్రకటన
అందుకోసం పాదయాత్ర చేస్తా.. బీజేపీ అభ్యర్థి మాధవీలత కీలక ప్రకటన
ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతున్నారా..
ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతున్నారా..
విడిపోతున్న మరో జంట.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన జీవి ప్రకాష్ దంపతుల
విడిపోతున్న మరో జంట.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన జీవి ప్రకాష్ దంపతుల
బుల్లి క్రేన్‌లో లారీ మంది ఎక్కితే ఇలాగే అవుతుంది మరీ..! షాకింగ్‌
బుల్లి క్రేన్‌లో లారీ మంది ఎక్కితే ఇలాగే అవుతుంది మరీ..! షాకింగ్‌
నీటిలో వీటిని వేసి ఇల్లు క్లీన్ చేశారంటే.. కీటకాలు రానే రావు..
నీటిలో వీటిని వేసి ఇల్లు క్లీన్ చేశారంటే.. కీటకాలు రానే రావు..
ఆరోగ్యానికి ఏది బెటర్.. పసుపు పాలా..? నీళ్లా..? పూర్తి వివరాలు
ఆరోగ్యానికి ఏది బెటర్.. పసుపు పాలా..? నీళ్లా..? పూర్తి వివరాలు
మ్యాంగో పుడ్డింగ్.. ఈ మామిడి రెసిపి తింటే, అబ్బబ్బా అనాల్సిందే
మ్యాంగో పుడ్డింగ్.. ఈ మామిడి రెసిపి తింటే, అబ్బబ్బా అనాల్సిందే
రాశిని మార్చుకున్న సూర్యుడు.. ఈ రాశులవారికి నెల రోజుల పాటు లాభాలే
రాశిని మార్చుకున్న సూర్యుడు.. ఈ రాశులవారికి నెల రోజుల పాటు లాభాలే
'తెలంగాణను కాంగ్రెస్ సంక్షోభంలోకి తీసుకెళ్తోంది'.. లక్ష్మణ్
'తెలంగాణను కాంగ్రెస్ సంక్షోభంలోకి తీసుకెళ్తోంది'.. లక్ష్మణ్
సితార మాస్ డాన్స్ అదరగొట్టేసింది..
సితార మాస్ డాన్స్ అదరగొట్టేసింది..