Mango: మ్యాంగో పుడ్డింగ్.. ఈ మామిడి రెసిపి తింటే, అబ్బబ్బా అనాల్సిందే

ఇందుకోసం ముందుగా మామిడి పండును తీసుకొని తోలును శుభ్రంగా కట్‌ చేసుకొని అనంతరం మామిడి గుజ్జు ముక్కులుగా కట్‌ చేసుకోవాలి. ఆ ముక్కలను జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఒక నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ను స్టౌవ్‌ పై పెట్టి మ్యాంగో గుజ్జును వేసుకొని 5 నిమిషాలు పాటు ఉడికించాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. మ్యాంగ్‌ గుజ్జు చిక్కగా కాగానే...

Mango: మ్యాంగో పుడ్డింగ్.. ఈ మామిడి రెసిపి తింటే, అబ్బబ్బా అనాల్సిందే
Mango Pudding
Follow us

|

Updated on: May 14, 2024 | 2:36 PM

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసిన మామిండి పండ్లే కనిపిస్తున్నాయి. నిగనిగలాడుతూ పసుపు పచ్చ రంగ కనిపించే మామిడి పండ్లను చూస్తుంటే నోరూరడం ఖాయం. కింగ్ ఆఫ్‌ ఫ్రూట్స్‌గా పిలిచే మామిడి పండ్ల రుచి అలాంటిది మరి. అయితే మామిడి పండ్లను ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఓసారి మ్యాంగోస్‌ ఇలా మ్యాంగో పుడ్డింగ్‌ను ట్రై చేయండి. రుచికి ఫిదా అవ్వకుండా ఉండరు. ఇంతకీ ఈ రెసిపి ఏంటి.? ఎలా తయారు చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా మామిడి పండును తీసుకొని తోలును శుభ్రంగా కట్‌ చేసుకొని అనంతరం మామిడి గుజ్జు ముక్కులుగా కట్‌ చేసుకోవాలి. ఆ ముక్కలను జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఒక నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ను స్టౌవ్‌ పై పెట్టి మ్యాంగో గుజ్జును వేసుకొని 5 నిమిషాలు పాటు ఉడికించాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. మ్యాంగ్‌ గుజ్జు చిక్కగా కాగానే పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో బౌల్‌లో పాలు తీసుకొని పాలు పోసి వేడి చేయాలి.

ఇక పాలు వేడి అయ్యేంతలోపు ఒక కప్పులో పాలు తీసుకొని అందులో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరుగుతున్న పాలలో చక్కెర వేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత, అంతకు ముందు కలుపుకున్న కస్టర్డ్‌ పౌడర్‌ పాలలో వేసి బాగా మరిగించాలి. పాలు చిక్కపడేంత వరకు అలాగే వేడి చేయాలి. అనంతరం స్టౌవ్‌పై నుంచి దించేసి అంతకు ముందు మనం సిద్ధం చేసుకున్న మ్యాంగో గుజ్జును పాలలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇక అనంతరం స్పంజి కేక్‌ను తీసుకొని చుట్టూ ఉండే బ్రౌన్‌ భాగాన్ని కట్ చేయాలి. ఆ తర్వాత బ్రెడ్‌ ముక్కలను చిన్న చిన్న స్లైస్‌గా కట్ చేసుకోవాలి. అనంతరం స్లైస్‌లను ఒక బౌల్‌లో పేర్చుకోవాలి. దీనికంటే ముందు చక్కెరతో పాసి పాకాన్ని బౌల్‌ అడుగున వేసుకోవాలి. అనంతరం బ్రెడ్‌ స్లైస్‌లను ఆ బౌల్‌లో పెట్టి మరో లేయర్‌ షుగర్‌ సిరప్‌ను వేయాలి.  ఆ తర్వాత పైన మరో లేయర్‌లో మ్యాంగో గుజ్జును బ్రెడ్స్‌పై వేయాలి. తర్వాత దానిని పక్కన పెట్టేయాలి.

మీకు నచ్చిన ఆకారంలో మ్యాంగ్ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి నచ్చిన పాత్రను ఎంచుకోవచ్చు. తర్వాత కొన్ని నీటిని తీసుకొని మరిగించిన తర్వాత అందులో మ్యాంగో జెల్లీ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ జెల్లీని అప్పటికే బ్రెడ్‌తో తయారు చేసిన పుండ్‌పై నెమ్మదిగా ఈవెన్‌గా వేయాలి. అనంతరం రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్‌ చేసుకోవాలి. అంతే అమృతాన్ని తలపించే మ్యాంగో పుడ్డింగ్‌ తయారైనట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!