AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమ్‌పున్ ఎఫెక్ట్: విశాఖలో పెరగనున్న ఎండలు

ఇప్పటికే కరోనా వైరస్‌తో అందరూ అవస్థలు పడుతుంటే.. మళ్లీ ఇప్పుడు ఉమ్‌పున్ తుఫాన్.. ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే దీన్ని 'సూపర్ సైక్లోన్‌'గా పరిగణించారు..

ఉమ్‌పున్ ఎఫెక్ట్: విశాఖలో పెరగనున్న ఎండలు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 20, 2020 | 10:10 AM

Share

ఇప్పటికే కరోనా వైరస్‌తో అందరూ అవస్థలు పడుతుంటే.. మళ్లీ ఇప్పుడు ఉమ్‌పున్ తుఫాన్.. ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే దీన్ని ‘సూపర్ సైక్లోన్‌’గా పరిగణించారు వాతావరణ శాఖ అధికారులు. అందులోనూ మే 20వ తేదీన ఈ తుఫాన్ మరింత తీవ్రంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా వెయ్యి కిలో మీటర్లు, పశ్చిమ్‌ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 1,160 కిలో మీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపుపురాకు వాయువ్యంగా 1,220 కిలో మీటర్లు దూరంలో వాయు గుండం కేంద్రీకతమై ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

కాగా ఉమ్‌పున్ ప్రభావం ఏపీ మీద కూడా ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. దీంతో సముద్ర తీర ప్రాంతాలకు, పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అలాగే మత్స్య కారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు.

అయితే ఈ ఉమ్‌పున్ ప్రభావం కారణంగా విశాఖలో ఎండలు ముదిరే ఛాన్స్ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా విశాఖ సముద్ర తీర ప్రాంతం కారణంగా వేడిశాతం బాగా పెరుగనుందట. సుమారు 2, 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో 34 నుంచి 35 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుఫాను సమయంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: 

టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్‌‌న్యూస్.. బిట్ పేపర్ తొలగింపు

షాకింగ్ న్యూస్.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

Follow Us
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..