ఛాయ్‌కేదీ సాటి.. ‘టీ’ గురించి మీకు తెలియని రహస్యాలు
‘టీ’ ఈ మాట వింటే కానీ.. చాలా మంది నిద్రలేవరు. పొద్దున్నే టీ సిప్ చేయనిదే కొంతమందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా.. ‘టీ’కి దాసోహమైనవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ.. ఈ వింటర్‌లో వేడి టీ తాగితే ఆ మాజానే వేరుగా ఉంటుంది. ఫలానా సమయానికి టీ తాగనిదే పనులు ముందుకు కూడా సాగవంటే.. అంతలా పవర్, ఫేమస్ ఉంది టీకి. టీలో చాలా రకాలు వచ్చినప్పటికీ.. దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. […]
‘టీ’ ఈ మాట వింటే కానీ.. చాలా మంది నిద్రలేవరు. పొద్దున్నే టీ సిప్ చేయనిదే కొంతమందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా.. ‘టీ’కి దాసోహమైనవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ.. ఈ వింటర్‌లో వేడి టీ తాగితే ఆ మాజానే వేరుగా ఉంటుంది. ఫలానా సమయానికి టీ తాగనిదే పనులు ముందుకు కూడా సాగవంటే.. అంతలా పవర్, ఫేమస్ ఉంది టీకి. టీలో చాలా రకాలు వచ్చినప్పటికీ.. దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. ఆఫీసుల్లో సైతం ఉద్యోగులు టీకి సపరేట్ టైంని కేటాయిస్తూండటం మనకు తెలిసిన విషయమే.
అంతర్జాతీయ టీ డే సందర్భంగా.. చిన్న ఫీచర్:
అంతేకాదు.. ‘టీ’ మీద ఇప్పటికే చాలా రకాల పాటలు కూడా వచ్చాయి అందులో మెగాస్టార్ నటించిన.. ఏ ఛాయ్.. చటుక్కున తాగరా భాయ్, చార్మీ డ్యాన్స్ చేసిన.. హే.. సక్కు భాయ్.. జర దేఖో.. గరం ఛాయ్.. అంటూ టీ మీద బోలెడు పాటలు వచ్చాయి. టీకి ఎంతగా ప్రాముఖ్యత ఉందంటే.. ఇతర దేశాలన్నీ.. మన దేశంతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా మనదేశంలో.. టీకి ఉండే ప్రాముఖ్యతే వేరు. ఏ సందర్భమైనా.. టీ, కాఫీలు ఉండాల్సిందే. అతిథులకు ముందుగా.. ఇచ్చేది కూడా టీనే. అసోం, డార్జిలింగ్‌లో టీ తోటలకు చాలా ప్రత్యేకత ఉంది. రోజూ టీ తాగుతున్నాం.. కానీ.. ఇంతకీ ఈ టీ ఎక్కడ.. ఎలా.. పుట్టిందో మీకు తెలుసా..! ఈరోజు టీ నేషనల్ డే కాబట్టి టీ గురించి పలు ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం..!
అరుదైన ‘టీ’ రహస్యాల్లో కొన్ని మీకు:
- చరిత్ర ప్రకారం.. టీని క్రీస్తుపూర్వం మొదటిసారిగా 2737లో చైనా చక్రవర్తి షెన్‌నంగ్ కనిపెట్టారు. ఆయన తాగే వేడి గిన్నెలో టీ తేయాకు పండిందట.. దాని నుంచి వచ్చిన టేస్ట్ ఆయనకు నచ్చడంతో.. మొదట బ్లాక్ టీ పుట్టుకొచ్చింది.
- ఆ తరువాత టీని.. మనం తాగే విధంగా తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది.
- అలాగే.. శతాబ్దాలుగా.. టీని ఔషధంగా వాడుతూ వచ్చేవారు. టీని తాగడానికే కాకుండా.. వివిధ రకాల మందుల్లో విరివిగా ఉపయోగించేవారు.
- టీ తేయాకు బట్టి.. సమయానుకూలంగా.. ఏ విధంగా కోశారు.. ఏ విధంగా ఎండబెట్టారు అన్నదానితోనే మనకు.. గ్రీన్, బ్లాక్, వైట్, ఊలాంగ్ టీ రకాలు వచ్చాయి.
- ఒకే మొక్క నుంచి రకరకాల టీలను తయారు చేసుకోవచ్చు.
- ఇక 1980లలో అమెరికాలో మొదటిగా టీ బ్యాగుల వాడకం మొదలైంది. వ్యాపారం నిమిత్తం.. అక్కడివారికి టీని టేస్ట్ చేయడానికి టీ పొడిని చిన్న బ్యాగుల్లో వేసి ఇచ్చేవారు.
- ఇంకొక ఆసక్తికర విషయమైమిటంటే.. 18వ శతాబ్దం నుంచీ రెండో ప్రపంచ యుద్ధం వరకూ అమెరికాలో గ్రీన్ టీ ఫేమస్.
- 1904లో వర్జీనియాలో ఐస్‌టీని కనిపెట్టారు. కొన్ని ఐస్ ముక్కలపై టీని పోసి తాగేవారు.
- తైవాన్‌లో 1980 నుంచీ బబుల్ టీ అంటే బుడగల టీ వాడకంలో ఉంది. చిక్కటి టీని గిలక్కొట్టి ఇస్తారు.
- కొరియా, చైనాలో ‘క్రిసాంతెమమ్’ అనే హెర్బల్ టీని బాగా తాగుతారు. అది జ్వరం, తలనొప్పికి చెక్ పెడుతుంది.
- ఇక టిబెట్‌లో వెన్న టీ బాగా ఫేమస్. దీన్ని బ్లాక్ టీ, యాక్ బటర్, ఉప్పు కలిపి తయారు చేస్తారు.
ఇక ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా డిఫెరెంట్ టీలను ట్రై చేస్తూ.. ఎంజాయ్ చేయండి.