బంగారం కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. పసిడి ధర మళ్లీ తగ్గిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.39,770కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గుతుంది. కాని ఈ సారి వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.53,200 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.38,400కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 200 తగ్గుదలతో రూ.37,200కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.53,200 వద్దనే కొనసాగుతోంది.