AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండక్టర్ వ్యాఖ్యతో.. ఆర్టీసీ బస్సులో కరోనా కలకలం..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీకు కరోనా ఉందంటూ ఓ జంటకు కండక్టర్ గట్టిగా చెప్పడంతో తమిళనాడు ఆర్టీసీ బస్సులో

కండక్టర్ వ్యాఖ్యతో.. ఆర్టీసీ బస్సులో కరోనా కలకలం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 8:32 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీకు కరోనా ఉందంటూ ఓ జంటకు కండక్టర్ గట్టిగా చెప్పడంతో తమిళనాడు ఆర్టీసీ బస్సులో కలకలం రేగింది. కండక్టర్ చెప్పింది ఇతర ప్రయాణికుల చెవుల పడటంతో అందరూ పరుగుపరుగున బస్సులోంచి పారిపోయారు. పన్రూతి నుంచి కడలూర్ వెళుతున్న బస్సులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వారు కోవిద్-19 పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ జంటకు కరోనా సోకిందన్న విషయం ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడంతో వారు బస్సులోని కండక్టర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆ దంపతులకు విషయం చెప్పాలని సూచించారు. అయితే కండక్టర్ ఈ విషయాన్ని దంపతులకు చెప్పడం ఇతర ప్రయాణికుల చెవుల పడటంతో బస్సులో కల్లోలం చెలరేగింది. మిగతా ప్రయాణికులందరూ ఒక్క ఉదుటున బస్సులోంచి బయటపడ్డారు.

Also Read: గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ చాలెంజ్.. టాప్ 10లో ముగ్గురు భారతీయులు..