తిరుపతిలో కరోనా టెర్రర్.. మరోసారి కఠిన లాక్‌డౌన్..
ఏపీలోని చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు.

Tirupati Lockdown: ఏపీలోని చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు. వచ్చే నెల 4వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని.. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని ఆయన అన్నారు. ఇక తిరుమలకు వెళ్లే భక్తులను బైపాస్ రోడ్డులో అనుమతిస్తామని కలెక్టర్ భరత్ గుప్తా స్పష్టం చేశారు.
కాగా, చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 30 శాతం తిరుపతిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు నగరంలో 1700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇక జిల్లావ్యాప్తంగా 56మంది కరోనాతో మరణించారు. మొత్తంగా 72 మంది పోలీసులకు కరోనా సోకిందని అన్నారు. కాగా, రానున్న 14 రోజుల పాటు లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయని.. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా రోడ్లపైకి రాకూడదని కలెక్టర్ భరత్ గుప్తా వెల్లడించారు.
Also Read:
సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..
