tirupati big cobra: తిరుమలలో భారీ నాగుపాము కలకలం.. పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలేసిన సిబ్బంది
జీఎన్‌సీ టోల్‌గేట్ సమీపంలోని విద్యుత్‌శాఖ భవనంలోకి ఈ భారీ నాగుపాము దూరింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
tirupati big cobra: తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. జీఎన్‌సీ టోల్‌గేట్ సమీపంలోని విద్యుత్‌శాఖ భవనంలోకి ఈ భారీ నాగుపాము దూరింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఉద్యోగి భాస్కర్‌నాయుడు.. విద్యుత్‌శాఖ భవనంలో ఉన్న భారీ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం నాగుపామును శేషాచల అటవీ ప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచి పెట్టారు. ఆ భారీ సర్పం పొడవు ఏకంగా ఏడు అడుగుల పొడవు ఉంది. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.