AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ ఆర్డర్..టీటీడీలోకి రమణదీక్షితులు రీ ఎంట్రీ..

సీఎం జగన్ మార్క్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో..ఇబ్బందులు పడ్డ వాళ్లకి జగన్ పిలిచి మరీ పదవులు ఇస్తున్నారు. గతంలో టీటీడీపై బహిరంగంగా విమర్శలు చేయడంతో రమణదీక్షితలను… పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి..  ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడం ద్వారా తీసివేశారు. అప్పట్లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ను కలిసి తన బాధను వెల్లిబుచ్చుకున్నారు.  తాజాగా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. శ్రీవారి కైంకర్యాలు […]

జగన్ ఆర్డర్..టీటీడీలోకి రమణదీక్షితులు రీ ఎంట్రీ..
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2019 | 12:47 AM

Share

సీఎం జగన్ మార్క్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో..ఇబ్బందులు పడ్డ వాళ్లకి జగన్ పిలిచి మరీ పదవులు ఇస్తున్నారు. గతంలో టీటీడీపై బహిరంగంగా విమర్శలు చేయడంతో రమణదీక్షితలను… పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి..  ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడం ద్వారా తీసివేశారు. అప్పట్లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ను కలిసి తన బాధను వెల్లిబుచ్చుకున్నారు.  తాజాగా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.  సీఎం జగన్‌ ఆదేశాలతో  తిరిగి ఆయన్ను టీటీడీ విధుల్లోకి తీసుకుంది. అలాగే ఆయన కుమారులు వెంకట కుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులను గోవిందరాజ స్వామి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. రమణ దీక్షితులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి కూడా శ్రీవారి ఆలయంలో పున:ప్రవేశం కల్పించింది.

గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా చాలాకాలం విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. టీటీడీ తాజా నిర్ణయంతో ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులు నిర్వర్తించనున్నారు. గతనెల 23న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం మేరకు ఆగమ సలహాదారుగా నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.