కేసీఆర్ డెడ్‌లైన్.. విధుల్లోకి చేరింది ఎంతమంది అంటే.?
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతధంగా కొనసాగుతోంది. అయితే ఇవాళ అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రాత్రి 12 గంటలోపు కార్మికులు చేరని పక్షంలో మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేటీకరణ చేస్తాం అని సీఎం ప్రకటించారు. ఇకపోతే ఈ డెడ్‌లైన్ వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఈ నెల 2న ప్రెస్ మీట్ పెట్టి […]
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతధంగా కొనసాగుతోంది. అయితే ఇవాళ అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రాత్రి 12 గంటలోపు కార్మికులు చేరని పక్షంలో మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేటీకరణ చేస్తాం అని సీఎం ప్రకటించారు.
ఇకపోతే ఈ డెడ్‌లైన్ వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఈ నెల 2న ప్రెస్ మీట్ పెట్టి డెడ్‌లైన్ విధించగా.. 3వ తారీఖున 17 మంది, 4 వ తేదీన ఆ సంఖ్య 34కు చేరుకోగా.. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 157 మంది సదరు డిపోల వద్ద దరఖాస్తులను అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు.