ఎమ్మార్వో హత్య కేసు: నిందితుడి పరిస్థితి విషమం..పోలీసులు రాబట్టిన ఇన్పర్మేషన్..

తహసీల్దార్ విజయా‌ రెడ్డి హత్యకేసులో నిందితుడు కూర సురేశ్ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోంది. 70 శాతం గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల సంరక్షణలోనే నిందితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఛాతీ, కాళ్లు, చేతులు, ముఖం తీవ్రంగా కాలినట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 36 గంటలు గడవడంతో స్కిన్‌బర్న్.. సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. అప్పుడు పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్నట్లు ఆస్పత్రి […]

ఎమ్మార్వో హత్య కేసు: నిందితుడి పరిస్థితి విషమం..పోలీసులు రాబట్టిన ఇన్పర్మేషన్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2019 | 4:11 AM

తహసీల్దార్ విజయా‌ రెడ్డి హత్యకేసులో నిందితుడు కూర సురేశ్ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోంది. 70 శాతం గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల సంరక్షణలోనే నిందితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఛాతీ, కాళ్లు, చేతులు, ముఖం తీవ్రంగా కాలినట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 36 గంటలు గడవడంతో స్కిన్‌బర్న్.. సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. అప్పుడు పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సురేశ్ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దారు విజయారెడ్డిని రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

పోలీసులు రాబట్టిన సమాచారం ఏంటి: 

ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. భూ వివాదం వల్లనే సురేశ్ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు చెప్పారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సురేశ్‌కు సంబంధించిన భూమిపై ఒక కేసు నడుస్తోందని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన వివరాలను సవరించే అంశంపైనే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. ఎవరైనా ప్రేరేపిస్తే సురేశ్ ఈ హత్య చేశారా లేదంటే తనకు తానే చేశారా అన్నది విచారిస్తున్నామని చెప్పారు.