బ్రేకింగ్: కాంచీపురంలో కాల్పుల కలకలం.. అమ్మాయి ప్రేమ కోసం..!

అమ్మాయి కోసం ఇద్దరి ప్రేమికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సినిమాలో సీన్‌ మాదిరిగా.. ఒక విద్యార్థి.. మరోక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం జిల్లా తాంబరం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ట్రిపుల్ ఈ చదువుతున్న ముఖేష్, విజయ్‌లు. అదే కాలేజీలోని ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు. ఈ ప్రేమ విషయంలో.. ఇదివరకే ఇరువురి మధ్య పలు వాగ్వాదాలు […]

బ్రేకింగ్: కాంచీపురంలో కాల్పుల కలకలం.. అమ్మాయి ప్రేమ కోసం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 06, 2019 | 1:14 PM

అమ్మాయి కోసం ఇద్దరి ప్రేమికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సినిమాలో సీన్‌ మాదిరిగా.. ఒక విద్యార్థి.. మరోక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం జిల్లా తాంబరం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ట్రిపుల్ ఈ చదువుతున్న ముఖేష్, విజయ్‌లు. అదే కాలేజీలోని ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు. ఈ ప్రేమ విషయంలో.. ఇదివరకే ఇరువురి మధ్య పలు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే.. ముఖేష్‌ని హెచ్చరించి.. అమ్మాయిని వదిలేయని చెప్పిన విజయ్. ముఖేష్ వెనక్కి తగ్గకపోవడంతో.. వండలూర్ పంచాయతీ వెంకట మంగళం గ్రామంలో ముఖేష్ ఇంటికి వెళ్లి మరీ.. అతన్ని.. గన్‌తో కాల్చి చంపిన విజయ్. అనంతరం అక్కడి నుంచి పరారైపోయిన నిందితుడు.

గాయాలతో ఉన్న ముఖేష్‌ని ఆస్పత్రికి తరలించిన స్థానికులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ముఖేష్. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. విజయ్‌ అనే విద్యార్థి చేతికి గన్‌ రావడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.