నేనో టైమ్ ట్రావెలర్..నా కడుపులో పెరుగుతున్నాడు ఏలియన్!

ఇటీవల తాను ఏ దేశంలో ఉంటున్నానో చెప్పడానికి ఇష్టపడని మహిళ.. తాను ఓ టైమ్ ట్రావెలర్‌ను అంటూ ఆసక్తికర విషయాలు చెప్పింది.  వాటిని వింటే మీరు షాకవ్వడం ఖాయం. ఆమె చెబుతున్న విషయాలు మిమ్మల్ని కాసేపు గగుర్పాటుకు గురిచేస్తాయి. మరి అంత విస్మయపరిచే విషయం ఏంటి అంటారా?  భవిష్యత్తుకు వెళ్లి వచ్చిన తాను ఏలియన్ వల్ల గర్భవతిని అయ్యానని ఆ మహిళ చెబుతోంది. అంతేకాదు, తన కడుపులో ఏలియన్ బిడ్డ పెరుగుతోందని తెలుపుతోందని… అల్ట్రా సౌండ్ రిపోర్టును […]

నేనో టైమ్ ట్రావెలర్..నా కడుపులో పెరుగుతున్నాడు ఏలియన్!
Ram Naramaneni

| Edited By:

Jul 24, 2019 | 6:22 AM

ఇటీవల తాను ఏ దేశంలో ఉంటున్నానో చెప్పడానికి ఇష్టపడని మహిళ.. తాను ఓ టైమ్ ట్రావెలర్‌ను అంటూ ఆసక్తికర విషయాలు చెప్పింది.  వాటిని వింటే మీరు షాకవ్వడం ఖాయం. ఆమె చెబుతున్న విషయాలు మిమ్మల్ని కాసేపు గగుర్పాటుకు గురిచేస్తాయి. మరి అంత విస్మయపరిచే విషయం ఏంటి అంటారా?  భవిష్యత్తుకు వెళ్లి వచ్చిన తాను ఏలియన్ వల్ల గర్భవతిని అయ్యానని ఆ మహిళ చెబుతోంది. అంతేకాదు, తన కడుపులో ఏలియన్ బిడ్డ పెరుగుతోందని తెలుపుతోందని… అల్ట్రా సౌండ్ రిపోర్టును ఆధారంగా చూపిస్తుంది. ఆమె చదివే యూనివర్శీటీలోని ప్రొఫెసర్ పాల్ మార్టెక్స్ అనే వ్యక్తి ద్వారా ఫ్యూచర్‌కు ట్రావెల్ చేశానని చెప్పుకొస్తుంది.

ఎలక్ట్రిసిటీ, రేడియో వేవ్స్ ద్వారా సదరు టైమ్ మెషిన్ పనిచేస్తుందని… దాని సహయంతో 14 మంది మిలటరీ సర్వెంట్లతో కలిపి మొత్తం 20 మంది మొదట 2900 సంవత్సరానికి , ఆ తర్వాత 3500 సంవత్సరానికి వెళ్లామని చెప్తుంది.   ఆ సమయంలో ఆండ్రోమెడ అనే పేరుగల గెలక్సీ నుంచి వచ్చిన ఏలియన్లకు, మనుషుల మధ్య పెద్ద యుద్ధం జరుగుతోందట. ఏలియన్లు మనుషుల కంటే మెరుగ్గా, బలంగా ఉన్నాయని… అవి తమని మానసికంగా, శారీరకంగా వేధించాయని పేర్కొంది.

ఆ 20 మందిలో ఆమె మాత్రమే ప్రాణాలతో భయటపడిందట. ఆ తర్వాత తిరిగి 2019లోకి వచ్చేశానని… మన టైమ్‌లో ఒక గంట అంటే అక్కడ రోజుల కింద లెక్కలోకి వస్తోంది అని తెలిపింది. ఈ సందర్భంగా తాను మరో షాకింగ్ విషయం చెప్పింది. తన కడుపులో ఇప్పుడు సగం ఏలియన్, సగం మనిషి వల్ల ఏర్పడిన పిండం పెరుగుతోందని. మరో 5 నెలల్లో ఆ బిడ్డకు జన్మనిస్తాను అని కూడా చెబుతోంది. చాలాసార్లు టైమ్ ట్రావెలర్స్ అని చెప్పుకునే వాళ్లు చెప్పే విషయాలు విస్మయానికి గురిచేస్తాయి. ఆమె వ్యాఖ్యల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu