ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్.. సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు.. ఎందుకంటే?
Tilak Varma Legal Notice: అటు సినిమా, ఇటు క్రికెట్ రంగాల్లోని టాప్ సెలబ్రిటీలకు నోటీసులు అందడంతో ఈ ఇష్యూ నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐ అనుమతి లేని లీగ్ వివాదం ఎటు దారితీస్తుందో, దీనిపై సిరాజ్, తిలక్ వర్మతో పాటు టాలీవుడ్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Mohammed Siraj TCA Notice: ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వివాదం చెలరేగింది. టీమిండియా స్టార్ క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) షాకిచ్చింది. అనుమతి లేని లీగ్‌ను ప్రమోట్ చేస్తున్నారంటూ వీరందరికీ లీగల్ నోటీసులు జారీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
అసలేం జరిగింది? వివాదానికి కారణం ఇదే..!
తెలంగాణలో ప్రతిపాదిత ‘TG20 లీగ్’ (TG20 League) చుట్టూ ఇప్పుడు ఈ వివాదం ముదిరింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ లీగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంతోనే యాక్టివ్ క్రికెటర్లయిన సిరాజ్, తిలక్ వర్మతో పాటు మాజీ ఆటగాడు అంబటి రాయుడు, ప్రముఖ నటులు వెంకటేష్, విజయ్ దేవరకొండలకు టీసీఏ లీగల్ నోటీసులు పంపింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి ఈ లీగ్‌ను నడిపిస్తోందని టీసీఏ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి అనధికారిక టోర్నమెంట్లను ప్రమోట్ చేయడం చట్టప్రకారం నేరమని, సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్లు యువ ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఐర్లాండ్ టూర్‌కు ముందే తిలక్, సిరాజ్‌లకు షాక్..
ప్రస్తుతం ఈ నోటీసులు అందుకొన్న ప్రముఖులెవరూ దీనిపై అధికారికంగా స్పందించలేదు. నటులు విజయ్ దేవరకొండ, వెంకటేష్ తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండగా, క్రికెటర్లు వారి వారి షెడ్యూల్స్‌లో ఉన్నారు. ఈ నెల చివర్లో జరగబోయే ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఎంపికయ్యారు. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత అక్షర్ పటేల్ స్థానంలో భారత టీ20 వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ నియమితుడై కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఇండియా-ఎ త్రిపాక్షిక సిరీస్‌లో కెప్టెన్‌గా మూడు హాఫ్ సెంచరీలతో జట్టును ఫైనల్‌కు చేర్చిన తిలక్, జూన్ 22న చెన్నై చేరుకుని అక్కడి నుంచి ఐర్లాండ్‌కు బయలుదేరాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో లీగల్ నోటీసులు రావడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
తిలక్ వర్మను వెంటాడుతున్న వివాదాలు!
యువ సంచలనం తిలక్ వర్మకు ఈ మధ్య కాలం అంతగా కలిసిరావడం లేదు. లీగల్ నోటీసుల వివాదానికి ముందే శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో తిలక్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దంబుల్లాలో మ్యాచ్ టై అయిన తర్వాత, వెలుతురు లేకపోయినా సూపర్ ఓవర్ ఆడించాలని తిలక్ పట్టుబట్టాడు. చివరకు ఆ సూపర్ ఓవర్‌లో భారత్ ఓడిపోవడమే కాకుండా, అంపైర్ల పట్ల తిలక్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు లీగల్ నోటీసు రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
