చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫ్యామిలీ.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనం నుంచి చిట్టీల రూపంలో వసూళ్లు చేసి పెట్టుబడిదారులను నట్టేట ముంచారు. గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని కేబీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫ్యామిలీ.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 7:05 PM

చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనం నుంచి చిట్టీల రూపంలో వసూళ్లు చేసి పెట్టుబడిదారులను నట్టేట ముంచారు. గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని కేబీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కూకట్‌పల్లికి చెందిన చేగొండి సూర్యనారాయణ, చోగొండి కనకదుర్గ, చేగొండి మాధురి స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇరుగుపొరుగు వారితో పాటు స్నేహితులు, బంధువులు అయిన 38 మంది నుంచి సుమారు రూ. 2.50 కోట్లు వసూలు చేశారు. గడువుతీరినా డబ్బులు కట్టినవారికి తిరిగి చెల్లించలేదు. డబ్బులు చెల్లించాలని నిలదీసినా స్పందన లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు.