AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ బీజేపీ మాజీ ఎంపీ రాజీనామా, పార్టీ నేతలపై ఫైర్, సొంత పార్టీపై నిప్పులు

రైతుల కష్టాలపై స్పందించని తమ పార్టీ నేతలు, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పంజాబ్ లో బీజేపీ మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా రాజీనామా చేశారు. అన్నదాతలు, వారి కుటుంబాలు..

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ బీజేపీ మాజీ ఎంపీ రాజీనామా, పార్టీ నేతలపై ఫైర్, సొంత పార్టీపై నిప్పులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 26, 2020 | 7:17 PM

Share

రైతుల కష్టాలపై స్పందించని తమ పార్టీ నేతలు, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పంజాబ్ లో బీజేపీ మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా రాజీనామా చేశారు. అన్నదాతలు, వారి కుటుంబాలు, వారి సన్నిహితులు ఈ చట్టాల కారణంగా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారని, అయినా తమ పార్టీ గానీ ఇతర నేతలు గానీ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఖల్సా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని తాను అనుకోలేదన్నారు.  2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఫతేగడ్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఈయన ఆప్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో వఛ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాగా ఫిరోజ్ పూర్ లో పలువురు బీజేపీ నేతలు కూడా ఇటీవల పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ మాజీ చీఫ్ కమల్ శర్మ మాజీ పీఏ సహా ఈ పార్టీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేశారు. రైతుల ప్రయోజనాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు దుయ్యబట్టారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కమలం పార్టీ నేతలపై రాజీనామా చేయాలంటూ ఒత్తిడులు పెరుగుతున్నాయి. కాగా మాజీ ఎంపీ ఒకరు వైదొలగడం మాత్రం ఇదే మొదటిసారి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్