AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోనెసంచిలో మృతదేహం కేసులో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర నిజాలు.. అసలు అందులో ఉన్నది ఎవరో తెలుసా?

కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్‌లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి

గోనెసంచిలో మృతదేహం కేసులో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర నిజాలు.. అసలు అందులో ఉన్నది ఎవరో తెలుసా?
uppula Raju
|

Updated on: Dec 26, 2020 | 7:28 PM

Share

కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్‌లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతురాలు ఈస్ట్‌ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందిని పంకజ్‌రాయ్‌గా గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబైలోని కాందీవ్లీలో నందిని ఆమె భర్త, మామతో కలిసి నివాసముంటోంది. డిసెంబర్‌లో ఆమె భర్త పని మీద వేరే ఊరు వెళ్లగా, ఇంట్లో నందిని, ఆమె మామ మాత్రమే ఉన్నారు. అయితే కొన్నిరోజులకే నందిని బీచ్‌లో శవమై తేలింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. చాలా సార్లు ఫోన్ చేసినా నందిని ఫోన్ పనిచేయకపోవడంతో వారికి అనుమానం తలెత్తింది. వెంటనే నందిని నాన్న ఆమె ఉంటున్న కాందీవ్లీకి వచ్చి వెతికాడు. అయినా ఆమె కనిపించలేదు. చుట్టు పక్కల విచారించినా ఎటువంటి వివరాలు తెలియలేదు. దీంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ వెళ్లి మిస్సింగ్ కంప్లెంట్ ఇచ్చాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నందిని మామపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నందిని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. రిపోర్ట్స్ వస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా నందిని తల్లిదండ్రులు కూతురు మృతిని తట్టుకోలేక గుండలవిసేలా రోధించడం అందరిని కంటతడిపెట్టిస్తోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్