పుష్ప సినిమా ప్రతినాయకుడిగా ఆర్య?.. ఇందులో ఆ తమిళ హీరో ఎందుకు చేయట్లేదో తెలుసా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఐదు భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది.

పుష్ప సినిమా ప్రతినాయకుడిగా ఆర్య?.. ఇందులో ఆ తమిళ హీరో ఎందుకు చేయట్లేదో తెలుసా..
Follow us
uppula Raju

|

Updated on: Dec 26, 2020 | 6:56 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఐదు భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా చేస్తోంది. కాగా ఈ సినిమా విలన్ క్యారెక్టర్ గురించి అందరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మొదటగా ప్రతినాయకుడిగా తమిళ హీరో విజయ్ సేతుపతి అనుకున్నారు. కాగా విజయ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అందుబాటులో లేవని తెలుస్తోంది. దీంతో మళ్లీ ఆర్య పేరు తెరపైకి వస్తోంది.

ఆర్య ఇదివరకే అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్‌గా చేశారు. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ పదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఆర్య ఇప్పటి వరకు తెలుగులో డైరెక్ట్ సినిమాలో నటించి చాలాకాలం అవుతోంది. ఈ విషయంపై ఇంకా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో నటిస్తున్నా ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అలాగే ఆర్య దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న ‘సర్‌పట్టా పరమ్‌బరై’ చిత్రంలో నటిస్తున్నారు.