ఉత్తరాదిని వణికిస్తున్న ఇసుక తుఫాన్… అకాల వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 30 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గుజరాత్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్ 16) మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు, పిడుగుల వాన కురుస్తోంది. […]

ఉత్తరాదిని వణికిస్తున్న ఇసుక తుఫాన్... అకాల వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 4:28 PM

ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 30 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

గుజరాత్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్ 16) మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు, పిడుగుల వాన కురుస్తోంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 16 మంది, గుజరాత్‌లో 9 మంది మరణించారు. భారీ వర్షాలు, ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్‌లో ఆరుగురు మృతి చెందారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్, చిత్తోర్‌గఢ్‌, శ్రీగంగానగర్‌, కోట, పిలానీ ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక గుజరాత్‌‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, పఠాన్, సబర్‌కాంత తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ సంభవించింది. మధ్యప్రదేశ్‌లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలపై ప్రధాని మోదీ స్పందించారు. అకాల వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!