ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఇక డబ్బులు డ్రా చేయడం వారికే సాధ్యం!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లో అకౌంట్ కలిగి ఉండి.. నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయని వారు ఇకపై బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలాంటి సేవలు పొందలేరు. ఎస్‌బీఐ గతంలోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కస్టమర్లను కోరింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే ఆ పనిని పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే అకౌంట్‌ను స్తంభింపజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేవైసీ పూర్తి […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:16 pm, Mon, 2 March 20
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఇక డబ్బులు డ్రా చేయడం వారికే సాధ్యం!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లో అకౌంట్ కలిగి ఉండి.. నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయని వారు ఇకపై బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలాంటి సేవలు పొందలేరు. ఎస్‌బీఐ గతంలోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కస్టమర్లను కోరింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే ఆ పనిని పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే అకౌంట్‌ను స్తంభింపజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు కూడా విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.

ఆర్‌బీఐ సూచనల ప్రకారం ఫిబ్రవరి 28లోగా అన్ని బ్యాంకులు వాటి కస్టమర్ల కేవైసీని అప్‌డేట్ చేయాలని గతంలోనే పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి వారి బ్రాంచ్‌కు వెళ్లాలి. దీని కోసం అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. లేదంటే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న యూజర్లు ఆన్‌లైన్‌లోనే కేవైసీని ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

కేవైసీ పూర్తిచేయాలంటే మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, కరెంట్/టెలిఫోన్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమ్ంట్లు తీసుకెలితే సరిపోతుంది.