AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 4 Winner : అభి’జీత్’‌ను గెలిపించిన అంశాలు ఇవే..వచ్చాడు..నిలిచాడు.. గెలిచాడు

ఊహించిందే జరిగింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగు సీజన్ 4 విజేతగా అభిజీత్ నిలిచాడు. 105 రోజుల పాటు రకరకాల ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీల మధ్యన నడిచిన ఈ షోలో అటు వెండితెర, ఇటు బుల్లి తెరకు

Bigg Boss Telugu 4 Winner : అభి'జీత్'‌ను గెలిపించిన అంశాలు ఇవే..వచ్చాడు..నిలిచాడు.. గెలిచాడు
Ram Naramaneni
|

Updated on: Dec 21, 2020 | 8:15 AM

Share

ఊహించిందే జరిగింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగు సీజన్ 4 విజేతగా అభిజీత్ నిలిచాడు. 105 రోజుల పాటు రకరకాల ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీల మధ్యన నడిచిన ఈ షోలో అటు వెండితెర, ఇటు బుల్లి తెరకు చెందిన 19 మంది వ్యక్తులు పాల్గొన్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా మరోసారి అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఫినాలేకు చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో చాలా గ్రాండ్‌గా సీజన్ ముగించింది బిగ్ బాస్. మెగాస్టార్ చేతుల మీదగా అభిజీత్ ట్రోఫీని అందుకున్నాడు.  రన్నరప్​గా​ అఖిల్​ సార్థక్​ నిలిచాడు.

ఆత్మవిశ్వాసం:

కాగా అభిజీత్‌ను గెలిపించిన అంశాల గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ కాన్పిడెన్స్ చాలా ముఖ్యం. ఆ విషయంలో అభిజీత్‌కు 100 మార్కుల పడ్డాయి. డే వన్ నుంచి అభిజీత్‌లో తాను విజేతను అవుతానన్న ఆత్మవిశ్వాసం కనిపించింది. మధ్యలో కొన్ని చోట్ల అది మితిమీరినా నాగార్జున లైన్‌లో పెడుతూ వచ్చారు.

బుద్ది బలం :

అభిజీత్‌కు ప్రధాన బలం తన బుద్ది. అవును..టాస్కులు వచ్చినప్పుడు పోట్లాటకు దిగకుండా లాజిక్స్‌తో, తన తెలివితేటలతో వాటిని గెలుచుకుంటూ వచ్చాడు. గేమ్ అంటే పోరాడాలి అందులో తెలివి కూడా ఉండాలి.

డ్యామేజ్‌ను గుర్తించడం :

ఒక ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌లో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో అభిజీత్ తెలివిగా అందులో నుంచి ఎస్కేప్ అయ్యాడు. అసలు ఊహించని విధంగా మోనాల్‌ను పూర్తిగా పక్కనబెట్టి..తన ఇమేజ్‌ను కాపాడుకున్నాడు.

ఇక ఇతరులకు ధైర్యం నూరి పోయడం, తనకు నచ్చినవాళ్లు అయినా సరే..వారు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలవడం..తప్పు చేసినప్పుడు వెంటనే క్షమాపణ చెప్పడం వంటివి అభిజీత్‌ను విజేతను అయ్యేలా చేశాయి.

Also Read : Big Boss4 winner: బిగ్‌బాస్4 విజేతగా నిలిచింది అతడే… చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న అభిజిత్

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..