Passenger Side Airbag…. కారులో రెండో ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేయనున్న కేంద్రం…

కారు ప్రయాణాన్ని మరింత సేఫ్‌గా ఉంచేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. గతేడాది జులైలో డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Passenger Side Airbag.... కారులో రెండో ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేయనున్న కేంద్రం...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 21, 2020 | 7:40 AM

కారులో షికారుకెళ్లడం ప్రతీ ఒక్కరికి సరదానే… కొద్ది మంది అవసరానికి కారును వినియోగిస్తుంటే… మరికొద్ది మంది విలాసానికి వినియోగిస్తుంటారు. అయితే కారు ప్రయాణాన్ని మరింత సేఫ్‌గా ఉంచేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. గతేడాది జులైలో డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా డ్రైవర్‌ పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సైతం ఇప్పటికే కేంద్రం వాహన తయారీ, రవాణా సంస్థలకు పంపినట్లు సమాచారం. భారత్‌ దేశంలో ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని, రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఇటీవల కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. తెలంగాణ సర్కారు సైతం ఇటీవలే రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల ప్రాణాల రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సైతం సీఎస్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి.

రెండు ఎయిర్ బ్యాగ్స్….

కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఎంత గడువు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పుడు చర్చలు జరుపుతున్నట్ల సమాచారం. నిబంధనలు అమలుకు ఏడాది గడువు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు ప్రస్తుత నిబంధనల ప్రకారం డ్రైవర్‌ వైపు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి. దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్‌ తప్పించుకొన్నా.. సహ ప్రయాణికుడి ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనను తీసుకొచ్చేందుకు సమాయత్తం అవుతోంది.