Lifestyle: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే ఏమవుతుంది.? ఎలా తెలుసుకోవాలి..
తీసుకునే ఆహారంలో మార్పులు, తప్పుడు జీవన విధానం కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించడం, ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవడం రక్తంలో షుగర్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. వీటిలో ప్రధానమైనవి గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాతావరణంతో సంబంధం...

రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగితే ప్రమాదకరమని తెలిసిందే. డయాబెటిస్ బాధితుల్లో కనిపించే ప్రధాన లక్షణం ఇదే. రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగడం వల్ల చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తం చక్కెర స్థాయిలు పెరగడమే కాదు, తగ్గడం కూడా ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే ఏవమవుతుంది.? దీనిని ఎలాంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉపవాసం గ్లూకోజ్ స్థాయిలు 70 mg/dL నుంచి 100 mg/dL ఉంటే నార్మల్ అని చెబుతున్నారు. ఒకవేళ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 100 నుంచి 125 mg/dL, భోజనం చేసిన తర్వాత 140 mg/dL కంటే ఎక్కువగా ఉంటే, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు అర్థం. అయితే ఒకవేళ రక్తంలో 80 mg/dL లేదా అంతకంటే తక్కువ ఉంటే షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇది అనేక రకాల శారీరక సమస్యలను దారి తీస్తుందని చెబుతున్నారు.
తీసుకునే ఆహారంలో మార్పులు, తప్పుడు జీవన విధానం కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించడం, ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవడం రక్తంలో షుగర్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. వీటిలో ప్రధానమైనవి గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాతావరణంతో సంబంధం లేకుండా చెమట రావడం, నాడీ కొట్టుకునే విధానంలో మార్పులు రావడం, చిరాకుగా ఉండడం, మైకంగా అనిపించడం వంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు 54 mg/dL కంటే తగ్గినప్పుడు మూర్చ వ్యాధి వస్తుందని చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే వెంటనే జీవనశైలిని మార్చుకోవాలని అర్థం. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ ఉండే ఫుండ్‌ను తీసుకోవాలి. ఒకవేళ పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే కొంచెం చక్కెర తీసుకోవడం లేదా షుగర్‌తో ఉండే బిస్కెట్స్‌ను తీసుకోవాలి. ఎప్పటికప్పుడు షుగర్ పరీక్షలు నిర్వహించుకోవాలి. ఇక ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే వారు డాక్టర్ సలహా లేకుండా చక్కెరను తగ్గించే చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
