AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Laptops Under 30K: విద్య, బిజినెస్ అవసరాలకు బెస్ట్ ల్యాప్ టాప్స్.. రూ. 30వేల లోపు ధరలోనే..

ఈ కథనంలో మీకు ప్రారంభ ధరల్లోనే మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్న ల్యాప్ టాప్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఒకవేళ మీరు మొదటి సారి ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తున్న వారైతే ఈ కథనం బాగా ఉపయోగపడుతుంది. ల్యాప్ టాప్ లలో ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను మీకు అందిస్తున్నాం. రూ. 30,000 లోపు ధరలోనే బెస్ట్ ల్యాప్ టాప్ ను జాబితా చేసి మీకు అందిస్తున్నాం.

Best Laptops Under 30K: విద్య, బిజినెస్ అవసరాలకు బెస్ట్ ల్యాప్ టాప్స్.. రూ. 30వేల లోపు ధరలోనే..
Affordable Laptops
Madhu
|

Updated on: Jan 29, 2024 | 6:46 AM

Share

ఇటీవల కాలంలో పర్సనల్ కంప్యూటర్ అనివార్యంగా మారుతోంది. విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు ఇలా ఎవరికైనా ఇది అవసరం. అయితే పీసీ అయితే ఇంట్లో లేదా ఆఫీసు మాత్రమే అలా ఉంచుకొనే వాడుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అందరూ ల్యాప్ టాప్ లకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు. వారు ఇంట్లో వర్క్ చేయడంతో పాటు పాఠశాలల, కళాశాలలు, కార్యాలయాల్లో కూడా వినియోగించుకునేందుకు వీలుగా ల్యాప్ టాప్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగానే ధర అధికంగా పెడితేనే మంచి ల్యాప్ టాప్ లు వాటిల్లో ఫీచర్లు వస్తాయి. అయితే ఈ కథనంలో మీకు ప్రారంభ ధరల్లోనే మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్న ల్యాప్ టాప్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఒకవేళ మీరు మొదటి సారి ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తున్న వారైతే ఈ కథనం బాగా ఉపయోగపడుతుంది. ల్యాప్ టాప్ లలో ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను మీకు అందిస్తున్నాం. రూ. 30,000 లోపు ధరలోనే బెస్ట్ ల్యాప్ టాప్ ను జాబితా చేసి మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..

యాసర్(స్మార్ట్ చాయిస్) వన్ 14 బిజినెస్ ల్యాప్ టాప్..

సమర్థనీయ కంప్యూటింగ్ కోసం బెస్ట్ చాయిస్ ఈ యాసర్ స్మార్ట్ చాయిస్ ల్యాప్ టాప్. దీనిలో ఏఎండీ రైజెన్ 3 3250యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 265జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ వినియోగదారులకు బెస్ట్ ఎంపిక. 14 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ అనుభవాన్ని అందిస్తుంది. విండోస్ 11 హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 24,580గా ఉంది.

హెచ్ పీ క్రోమ్ బుక్ ఎక్స్ 360 ఇంటెల్ సెలెరాన్ ఎన్4120..

ఈ ల్యాప్ టాప్ లో 14 అంగుళాల మైక్రో ఎడ్జ్ టచ్ స్క్రీన్ అమర్చి ఉంటుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4120 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. దీని బరువు 1.49 కేజీ ఉంటుంది. ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్ తో క్రోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. పోర్టబుల్ 2ఇన్1 ల్యాప్ టాప్ ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 27,990గా ఉంది.

ఇవి కూడా చదవండి

టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్ టాప్..

ఈ ల్యాప్ 15.6 అంగుళాల ఐ కంఫర్ట్ డిస్ ప్లే ను కలిగి ఉంది. 14.8ఎంఎం అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వస్తుంది. దీనిలో ఇంటెల్ కోర్ 11వ జనరేషన్ ఐ3 ప్రాసెసర్ ఉంటుంది. 8ఈబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 70వాట్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. విండోస్ 11 ఆధారంగా పనిచేస్తుంది. ఇది కేవలం 1.56కేజీ మాత్రమే బరువు ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 23,990గా ఉంటుంది.

లెనోవో ఐడియాప్యాడ్ డీ330 ఇంటెల్ సెలెరాన్ ఎన్4020..

ఇది 10.1 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిటాచబుల్ 2ఇన్1 ల్యాప్ టాప్. దీనిలో 4జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ ఉంటుంది. విండోస్ 10 ఆధారంగా పనిచేస్తుంది. ఒక సంవత్సరం వారంటీ వస్తుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్40420 ప్రాసెర్ ను కలిగి ఉంటుంది. దీని బరువు 1.1 కిలోలు మాత్రమే. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో చాలా స్లిమ్ గా ఈ డివైజ్ ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 24,990గా ఉంది.

జియోబుక్ 11(2023)..

అతి తక్కువ ధరలో అధునాతన కంప్యూటింగ్ ఈ జియో బుక్ 11తో సాధ్యమైంది. దీనిలో మీడియా టెక్ 8788 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఏఆర్ఎం మాలీ జీ72 ఎంపీ3 జీపీయూతో వస్తుంది. 29.5 సెంమీ, 60హెర్జ్ డిస్ ప్లే తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. జియో ఓఎస్ లో రన్ అవుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి మద్దతునిస్తుంది. దీని బరువు కేవలం 990గ్రాములు మాత్రమే ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 14,701గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..