AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voter ID Card: ఓటర్ ఐడీలో చిరునామా మార్చుకోవడం ఎలా? చాలా సింపుల్.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..

మీరు ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటర్ ఐడీ కార్డు ఉండాల్సిందే. అయితే దానిలో వివరాలు కూడా అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటరు ఐడీలో పాత అడ్రస్ ఉండిపోయినా.. దానిని ఇప్పటికీ మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఆన్ లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి దానిలో కొత్త అడ్రస్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. ఒక మీరు కూడా ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకోవాలనుకుంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో పోండి చాలు..

Voter ID Card: ఓటర్ ఐడీలో చిరునామా మార్చుకోవడం ఎలా? చాలా సింపుల్.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
Voter Id
Madhu
| Edited By: TV9 Telugu|

Updated on: Jan 29, 2024 | 1:51 PM

Share

సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే తుది ఓటరు జాబితాలను విడుదల చేసింది. మీరు ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటర్ ఐడీ కార్డు ఉండాల్సిందే. అయితే దానిలో వివరాలు కూడా అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటరు ఐడీలో పాత అడ్రస్ ఉండిపోయినా.. దానిని ఇప్పటికీ మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఆన్ లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి దానిలో కొత్త అడ్రస్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. ఒక మీరు కూడా ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకోవాలనుకుంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో పోండి చాలు..

ఫారం-8ని నింపాలి..

మీరు మొదటిగా ఆన్ లైన్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. దానిలో ఫారం 8 అని కనిపిస్తుంది. ఈ ఫారం ఎనిమిది ద్వారానే ఓటర్లు తమ ఐడీల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి చిరునామా, ప్రస్తుతం కార్డుపై వివరాల్లో మార్పులు, కొత్త ఓటర్ ఐడీ కార్డు కావాలన్నా ఇదే ఫారం సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • అందుకోసం ముందుగా https://voters.eci.gov.in/ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, క్యాప్చాను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ చేయాలి. అప్పుడు మీరు సైట్లోకి వెళ్తారు.
  • హోమ్ స్క్రీన్ మెనూలో నుంచి ఫారం-8పై క్లిక్ చేయాలి. ‘షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/రిప్లేస్ మెంట్ ఆఫ్ ఈపీఐసీ/ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ’ అని రాసి ఉండటంతో దానిపై ఫారం8 అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఆ వెంటనే మరో పేజీలోకి మిమ్మల్ని అది తీసుకెళ్తుంది. ఆ దరఖాస్తు ఎవరికోసం అని అడుగుతుంది. ‘సెల్ఫ్’ , ‘అదర్ ఎలక్టర్’ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్లికేషన్ మీ కోసమే అయితే సెల్ప్ అని, వేరొకరి అయితే అదర్ ఎలక్టర్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి.
  • ఆ తర్వాత ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మరో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిలో మీరు పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి. అవన్నీ మీవే అని నిర్ధారించడానికి ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్ పై షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అసెంబ్లా నియోజకవర్గం పరధిలోన లేక బయట నివాసం ఉంటున్నారా అని అడుగుతుంది. మీ నివాస స్థానాన్ని బట్టి దీనిని ఎంచుకోవచ్చు.
  • అప్పుడు మీకు ఫారం 8 కనిస్తుంది. దానిలో మూడు పార్టులు ఉంటాయి. సెక్షన్ ఏ లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • సెక్షన్ బీలో వ్యక్తిగత వివరాలు అంటే పేరు వంటివి పూర్తి చేయాలి. సెక్షన్ సీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న చిరునామాను పూరించి, దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ డీలో డిక్లరేషన్ ఉంటుంది. సెక్షన్ ఈలో రివ్యూ, సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది.
  • అయితే మీరు మార్చుతున్న చిరునామాను తగినట్లుగా ఓ రుజువు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం వాటర్/గ్యాస్ కనెక్షన్(కనీసం ఏడాది)ఎలక్ట్రిసిటీ బిల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఇండియన్ పాస్ పోర్టు, రెవన్యూ డిపార్ట్ మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డు, రిజిష్టర్డ్ రెంట్ లీజ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ వంటి వంటి సమర్పించాల్సి ఉంటుంది.
  • ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఒక్కసారి ప్రివ్యూ చూసుకొని అన్నీ సరిగ్గా ఉంటే సబ్మిట్ చేసేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..