ఈ యాప్స్ ఫోన్లో ఉంటే.. మీ సమాచారం మాయమైనట్లే..!

నెట్‌ లేనిదే జీవితం లేదనే విధంగా ఉంది ఇప్పటి యువత పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఆహ్లదానికి, ఆనందానికి ఎన్నో సరికొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ యాప్స్‌తో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. యూజర్ల దగ్గర నుంచి నగదు, కీలక సమాచారాన్ని లాగేందుకు కొత్త పంధాలను ఫాలో అవుతున్నారు. ఎట్రాక్టివ్ థీమ్స్, సరికొత్త పేర్లతో కొత్తరకమైన యాప్స్ రూపొందించి.. వాటిని జనాలు ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా ఆకర్షిస్తున్నారు. ఇక […]

ఈ యాప్స్ ఫోన్లో ఉంటే.. మీ సమాచారం మాయమైనట్లే..!
Follow us

|

Updated on: Oct 15, 2019 | 5:18 PM

నెట్‌ లేనిదే జీవితం లేదనే విధంగా ఉంది ఇప్పటి యువత పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఆహ్లదానికి, ఆనందానికి ఎన్నో సరికొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ యాప్స్‌తో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. యూజర్ల దగ్గర నుంచి నగదు, కీలక సమాచారాన్ని లాగేందుకు కొత్త పంధాలను ఫాలో అవుతున్నారు. ఎట్రాక్టివ్ థీమ్స్, సరికొత్త పేర్లతో కొత్తరకమైన యాప్స్ రూపొందించి.. వాటిని జనాలు ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా ఆకర్షిస్తున్నారు. ఇక ఆ యాప్స్ ద్వారా మాల్‌వేర్ వైరస్‌లు స్మార్ట్ ఫోన్‌లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో మన విలువైన సమాచారం దొంగల చేతికి అందుతోంది. ఇక ఈ సమాచారంతో జల్లెడపట్టిన గూగుల్ సంస్థ.. కొన్ని డేంజరస్ యాప్స్‌ను గుర్తించింది. అవన్నీ రూల్స్‌కు విరుద్ధంగా ఉండటంతో.. యూజర్లు వీటి విషయంలో అలెర్ట్‌గా ఉండాలని గూగుల్ హెచ్చరించింది. ఇలాంటివి ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలంటూ సూచించింది. ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి సుమారు 29 యాప్స్‌ను తొలిగించింది కూడా.

ఈ యాప్స్ అన్ని HiddAd కేటగిరీకి చెందినవని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ స్పష్టం చేసింది. వీటిని ఇన్‌స్టాల్ చేసినప్పుడు.. ఫోన్లో ఐకాన్ మాయం అయ్యి.. ఆ యాప్‌కి సంబంధించిన షార్ట్‌కట్ హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుందట. తద్వారా ఆ యాప్‌ అన్ ఇన్‌స్టాల్ చేయడం కుదరదు. అటు ఆ షార్ట్ కట్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే.. ఫుల్ స్క్రీన్ యాడ్స్ రావడమే కాకుండా సోషల్ మీడియా యాప్స్ ఉపయోగిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ యాడ్ వేర్ యాప్స్ ను కూడా.. వెంటనే ఇన్ స్టాల్ చేసేస్తాయట. కాబట్టి అందరూ కూడా ఆ యాప్స్‌ను వెంటనే ఫోన్ల నుంచి డిలేట్ చేస్తే విలువైన సమాచారం భద్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాగా ఆ 29 యాప్స్ లిస్ట్‌ను మీరు కూడా ఓ లుక్కేయండి.

  1. Feel Camera HD
  2. Filter Photo Frame
  3. Lens Flares
  4. Magic Effect
  5. QR Code Scanner
  6. Super Mark
  7. Photo Effect Pro
  8. Art Filter
  9. Lie Detector Prank
  10. New Hair Fashion
  11. Smart Magnifier Pro
  12. Magnifier Pro-Magnifying Glass
  13. Magnifying Glass Pro
  14. Cut Cut Mix
  15. Cut Cut MIx Pro
  16. Galaxy Overlay
  17. Colour Splash Photo Effect
  18. Age Face
  19. Photo Blur
  20. Blur Image
  21. Super Magnifier Lite
  22. Magnifying Pro
  23. Qing Camera
  24. Reflex Camera HD
  25. First Camera HD
  26. Rhythm Camera
  27. Pretty Makerup Photo
  28. Glitch Lens – Vaporwave & Ghost Photo Editor
  29. Multi Apps- Multiple Accounts Simultaneously

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..