AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారిని కలిసిన చిరు.. కేసీఆర్‌ను మరిచారా..!

మెగాస్టార్ చిరంజీవి ఇంకా సైరా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఆ మధ్యన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను కలిసిన చిరు.. సినిమాను చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన కోరిక మేరకు తమిళసై కూడా కుటుంబంతో ఈ సినిమాను వీక్షించి.. ‘‘సైరా ఒక అద్భుతం.. చిరంజీవి గారూ మీరు నిజంగా […]

వారిని కలిసిన చిరు.. కేసీఆర్‌ను మరిచారా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 15, 2019 | 5:48 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ఇంకా సైరా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఆ మధ్యన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను కలిసిన చిరు.. సినిమాను చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన కోరిక మేరకు తమిళసై కూడా కుటుంబంతో ఈ సినిమాను వీక్షించి.. ‘‘సైరా ఒక అద్భుతం.. చిరంజీవి గారూ మీరు నిజంగా చాలా గ్రేట్’’ అంటూ కామెంట్లు చేశారు. ఇక ఆ తరువాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా తాజాగా కలిశారు చిరు. సతీసమేతంగా తాడేపల్లికి వెళ్లిన ఆయన.. జగన్‌ను కలిసి సైరాను వీక్షించమని కోరారు. ఈ సందర్భంగా జగన్ కూడా సానుకూలత చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ సంగతేంటని కొందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా చిరు, కేసీఆర్ కుటుంబాల మధ్య ముందు నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా కేటీఆర్, రామ్ చరణ్‌లు మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే చెర్రీ నటించిన ధ్రువ, వినయ విధేయ రామ చిత్రాల ఆడియో ఫంక్షన్‌లకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్.. చెర్రీపై ప్రశంసలు కూడా కురిపించాడు. సినిమా, రాజకీయాలకు అతీతంగా వీరిద్దరి స్నేహం కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధం కంటిన్యూ అవుతోంది. అంతేకాదు ఇటీవల జరిగిన సైరా ఆడియో వేడుకకు కూడా కేటీఆర్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వలన తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని కేటీఆర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే సైరాను వీక్షించవల్సిందిగా ఇంతవరకు చిరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు వీలు చూసుకొని అప్పుడప్పుడు సినిమాలను చూసే కేటీఆర్ కూడా ఇప్పటివరకు.. తన ఫ్రెండ్ చెర్రీ నిర్మించిన సైరాను చూడకపోవడం గమనార్హం. అయితే సైరాకు ఏపీలో స్పెషల్ షోలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ తెలంగాణలో ప్రత్యేక షోలకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే చిరు, కేసీఆర్‌ను కలవలేదన్నది కారణంగా భావిస్తున్నారు. మరోవైపు చిరుకు బంధువైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడిన తరువాతి నుంచి ఈ ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం తగ్గుతూ వస్తోందన్నది ఇన్నర్ టాక్. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ.. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందు వల్లనే చిరు ఇంకా కేసీఆర్‌ను కలవలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Follow Us