బరువుకు చెక్ పెట్టే పసుపు.. ఒబేసిటీకి ఇక చెల్లు!

బరువుకు చెక్ పెట్టే పసుపు.. ఒబేసిటీకి ఇక చెల్లు!

వంటింట్లో వాడే పసుపు.. ఎన్నో రోగాలు నయం చేయడానికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఆర్థరైటీస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు పసుపు ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. వీటితో పాటుగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన పోషకం ఉంది. ఇది మంట, వాపుల నుండి ఉపశమనం కలిగించే వ్యాధి నిరోధక లక్షణాలు, శక్తివంతమైన […]

Ravi Kiran

|

Oct 15, 2019 | 5:58 PM

వంటింట్లో వాడే పసుపు.. ఎన్నో రోగాలు నయం చేయడానికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఆర్థరైటీస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు పసుపు ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. వీటితో పాటుగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన పోషకం ఉంది. ఇది మంట, వాపుల నుండి ఉపశమనం కలిగించే వ్యాధి నిరోధక లక్షణాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, మూలికలను తీసుకునేటప్పుడు కర్కుమిన్‌ను కూడా ఉపయోగిస్తే.. దానికి ఉన్న గుణాలు మరింత శక్తివంతంగా పని చేసి.. బరువు తగ్గడంతో సహాయపడతాయి. ఊబకాయం లేదా స్థూలకాయంకు కారణమయ్యే కొవ్వు కణాలు పరిపక్వత చెందకుండా ఈ పోషకాలు నిరోధిస్తాయి, అవసరమైన స్థాయిలో కొవ్వు ఉన్నప్పటికీ బరువు పెరగకుండా నిరోధిస్తాయి.

మరోవైపు కర్కుమిన్ శరీరంలో ఉండే తెలుపు కొవ్వును గోధుమ కొవ్వుగా మార్చి.. ఊబకాయాన్ని నిరోధించడమే కాకుండా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ఇంతకీ తెలుపు కొవ్వుకు.. గోధుమ కొవ్వుకు ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం కింద, ముఖ్యమైన అవయవాల చుట్టూ చేరిందాన్ని తెల్ల కొవ్వు అంటారు. ఊబకాయానికి ఇదే ప్రధాన కారణం. ఇక శారీరక శ్రమతో వచ్చే కొవ్వు.. బ్రౌన్ ఫ్యాట్. ఇది గ్లూకోజ్‌తో కలిసి శరీరంలో శక్తిగా ఉపయోగించబడుతుంది.

అంతేకాకుండా కర్కుమిన్ శరీరంలో గ్రహించలేని అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మిరియాలులోని ఫైబర్ కంటెంట్.. కర్కుమిన్‌లో తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల మిరియాలు, పసుపు జోడించి తింటే.. శారీరిక శక్తి, సామర్ధ్యం మరింత పెరుగుతుంది. ఇవే కాదు మరిన్ని మార్గాల్లో కూడా బరువు తగ్గడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu