‘క్రిస్మస్ స్టార్’..దాని వెనుక కథేంటి..?

క్రిస్మస్ పేరు చెబితే.. అందరికి ‘స్టార్’ గుర్తుకు వస్తుంది. క్రిస్టియన్ కుటుంబాలు తమ ఇళ్లపై క్రిస్మస్ మాసంలో ఈ స్టార్‌ని ఉంచుతారు. అసలు ఈ స్టార్‌ని ఎందుకు పెడతారు..?. దాని వెనుక ఆసక్తికరమైన కోణం ఏమైనా ఉందా..? ఈ స్టోరీలో తెలుసుకుందాం.. అవును క్రిస్మస్ స్టార్ వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. దాదాపు  రెండు వేల ఏళ్ల పూర్వం ఇశ్రాయేలు దేశంలోని బెత్లహేంలో ‘కన్య’  అయినటువంటి  మరియమ్మ కడుపున ఏసు పురుడు పోసుకున్నాడు.  అప్పటి ఇశ్రాయేలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:48 pm, Fri, 20 December 19
 'క్రిస్మస్ స్టార్'..దాని వెనుక కథేంటి..?

క్రిస్మస్ పేరు చెబితే.. అందరికి ‘స్టార్’ గుర్తుకు వస్తుంది. క్రిస్టియన్ కుటుంబాలు తమ ఇళ్లపై క్రిస్మస్ మాసంలో ఈ స్టార్‌ని ఉంచుతారు. అసలు ఈ స్టార్‌ని ఎందుకు పెడతారు..?. దాని వెనుక ఆసక్తికరమైన కోణం ఏమైనా ఉందా..? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అవును క్రిస్మస్ స్టార్ వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. దాదాపు  రెండు వేల ఏళ్ల పూర్వం ఇశ్రాయేలు దేశంలోని బెత్లహేంలో ‘కన్య’  అయినటువంటి  మరియమ్మ కడుపున ఏసు పురుడు పోసుకున్నాడు.  అప్పటి ఇశ్రాయేలు రాజు హేరోదు తొలిసారి జనాభా లెక్కలను ప్రారంభించాడు. అప్పుడు  తమ పేర్లు నమోదు చేసుకోడానికి  నెలలు నిండిన  మరియమ్మను తీసుకుని  ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యోసేపు.. నజరేతు పట్టణం నుంచి బెత్లహేంకు వెళ్తారు. అక్కడ వారు సేదతీరడానికి సత్రాలలో స్థలం దొరకదు. దీంతో దగ్గర్లో ఉన్న ఓ గొర్రెల పాకలో నిద్రిస్తారు. అక్కడ వారికి ప్రేమ మూర్తి ఏసు జన్మిస్తాడు.

ఏసు పుట్టిన వార్తను గాబ్రియేలు యెక్క దూత..ఆ ప్రాంతానికి దగ్గర్లోని గొర్రెల కాపలాాదారులకు చేరవేస్తాడు. తమను రక్షించాడని ప్రభువు   జన్మించాడని ఆ కాపరులు తన్మయత్వంతో అక్కడికి వచ్చి బుల్లి ఏసును దర్శించుకుంటారు. అంతకుముందే ఆకాశంలో ఇప్పటివరకు కనిపించని విధంగా ప్రకాశిస్తోన్న ఓ నక్షత్రాన్ని తూర్పు దేశం బెత్లెహాంకు చెందిన ముగ్గురు జ్ఞానులు గమనిస్తారు.

అయితే బైబిల్లో ఉన్న సమాచాారం ప్రకారం  తూర్పు దేశ ఙ్ఞానులు ఏసు పుట్టినవెంటనే ఆయనను దర్శించుకోలేకపోయారు. మొదట తూర్పు వైపున గొప్ప నక్షత్ర ప్రకాశాన్ని గమనించిన వారు.. ఒక పాలకుడు జన్మించాడని అంచనాకు వచ్చారు. ఆయనను దర్శించుకునేందుకు జెరూసలేం రాజప్రసాదానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాని అతను రాజు కోటలో పుట్టలేదని అర్ధం చేసుకోని..ఆ నక్షత్ర  ప్రకాశాన్ని బట్టి తమ ప్రయాణాన్ని సాగించారు.  చివరకు  యోసేపు,  మరియల గృహంలో బుల్లి ఏసును చూసి..తమ జన్మదన్యమైందని భావిస్తారు. యేసు క్రీస్తు జన్మించక ముందు 1452 సంవత్సరాల క్రితమే ప్రవక్త బిలాము యేసు క్రీస్తు జననం గురించి ప్రవచించాడు. యాకోబు నుండి ఒక నక్షత్రం వచ్చినట్లు ప్రవక్త చెప్పాడు.  ఈ విధంగా ఏసును కనుగునేందుకు  తూర్పు జెరుసలెం నుంచి బెత్లెహాంకు  ఓ నక్షత్రం సహాయం చేసిన కారణంగా క్రిస్మస్ కాలంలో.. ఏసును పూజించేవారు తమ ఇంటిపై స్లార్‌ని ఉంచుతారు. దీన్ని.. ‘క్రిస్మస్ స్టార్ లేదా స్టార్ ఆఫ్ బెత్లహాం’గా పిలుస్తారు.