జాను మూవీ రివ్యూ :’96’కి సెల్ఫ్‌ అటెస్టెడ్‌ జెరాక్స్ కాపీ ‘జాను

సినిమా: జాను నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నటీనటులు: శర్వానంద్‌, సమంత, వెన్నెలకిశోర్‌, రఘుబాబు, వర్ష బొల్లమ్మ, శరణ్య తదితరులు దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్‌ నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌ రచన: సి.ప్రేమ్‌కుమార్‌, మిర్చి కిరణ్‌ సంగీతం: గోవింద్‌ వసంత కెమెరా: మహేంద్రన్‌ జయరాజు విడుదల: ఫిబ్రవరి7, 2020 కొన్ని సినిమాలకు విడుదలకు ముందే విశేషమైన ప్రాచుర్యం వచ్చేస్తుంది. ఆ కథల్లో ఉన్న యూనివర్శల్‌ అప్పీల్‌, సగటు మానవుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్… సబ్జెక్ట్ ని […]

జాను మూవీ రివ్యూ :'96'కి సెల్ఫ్‌ అటెస్టెడ్‌ జెరాక్స్ కాపీ 'జాను
Follow us

|

Updated on: Feb 07, 2020 | 6:30 PM

సినిమా: జాను నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నటీనటులు: శర్వానంద్‌, సమంత, వెన్నెలకిశోర్‌, రఘుబాబు, వర్ష బొల్లమ్మ, శరణ్య తదితరులు దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్‌ నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌ రచన: సి.ప్రేమ్‌కుమార్‌, మిర్చి కిరణ్‌ సంగీతం: గోవింద్‌ వసంత కెమెరా: మహేంద్రన్‌ జయరాజు విడుదల: ఫిబ్రవరి7, 2020 కొన్ని సినిమాలకు విడుదలకు ముందే విశేషమైన ప్రాచుర్యం వచ్చేస్తుంది. ఆ కథల్లో ఉన్న యూనివర్శల్‌ అప్పీల్‌, సగటు మానవుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్… సబ్జెక్ట్ ని డైరక్టర్‌ డీల్‌ చేసిన విధానం… ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. ఆ పర్టిక్యులర్‌ కాన్సెప్ట్ మీద పుట్టే ఆసక్తి మాత్రం ఇంకో రేంజ్‌లో ఉంటుంది. లేటెస్ట్ గా అలాంటి ఇంట్రస్ట్ ని కలిగించిన సబ్జెక్ట్ తమిళ ’96’. తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ అయింది. కథ అబ్బాయి పేరు కె.రామచంద్ర (శర్వానంద్‌). అమ్మాయి జానకీదేవి (సమంత). ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అలా కలిసి పెరిగిన వారి మధ్య ప్రేమ మనకు కొత్త కాదు. తెలుగు సినిమాలకు అస్సలు కొత్త కాదు. కానీ ఈ సినిమాలో పదో తరగతికి చేరుకున్న అబ్బాయి-అమ్మాయి మధ్య కొత్తగా ‘ప్రేమ’ పుడుతుంది. అంతే… అప్పటిదాకా ఫ్రీగా ఉన్న అబ్బాయి ఒక్కసారిగా బిగుసుకుపోతాడు. అమ్మాయితో అంతకు ముందులాగా సరదాగా మాట్లాడలేడు. ఎదురుపడలేడు. ఒకవేళ ఎదురైనా మౌనంగా ఉంటాడు. అలా అతను ఆమె మీద ఉన్న ప్రేమను చెప్పడానికి తికమకపడుతుంటాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే పాఠశాలకు సెలవులు వచ్చేస్తాయి. అబ్బాయి ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అతని కుటుంబం హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి వారి ప్రేమ ఏమైంది? మళ్లీ 15 ఏళ్ల తర్వాత రీ యూనియన్‌ పార్టీలో కలుసుకున్న ఆ ఇద్దరి మానసిక పరిస్థితి ఎలాంటిది? ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు? అన్నేళ్ల దూరాన్ని ఆ ఒక్క రాత్రి ఎలా భర్తీ చేస్తుంది? కొన్ని గంటల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు? విడిపోయే క్షణాల్లో గుండెల బరువును మెజర్‌ చేయడానికి ఏ పరికరాలు సరిపోతాయి?…. ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్‌ పాయింట్లు – నటీనటుల నటన – కాన్సెప్ట్ – పాటలు – రీరికార్డింగ్‌ – కెమెరా మైనస్‌ పాయింట్లు – నెమ్మదిగా సాగే ఫస్టాఫ్‌ – సహజత్వానికి దూరంగా కొన్ని సీన్లు.. విశ్లేషణ తమిళంలో ’96’ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ ఈ సినిమాకు డైరక్షన్‌ చేశారు. పెరుగుతున్న టెక్నాలజీ, పాత జ్ఞాపకాలు.. ప్రస్తుత పరిస్థితులను కనెక్ట్ చేస్తూ ఆయన రాసుకున్న కథ ఇది. తమిళ చిత్రానికి మక్కికి మక్కిగా తెలుగులో తీశారు. ఏ కోశానా తెలుగులో మార్పు కనిపించదు. తమిళంలో విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన ’96’ చూసి భాష తెలియని వారు కూడా కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఆ మేజిక్‌ క్రియేట్‌ చేయడానికి శర్వానంద్‌, సమంత ప్రయత్నించారు. స్కూలు చదివే విద్యార్థుల పాత్రలు చేసిన సాయికుమార్‌, గౌరి తెలుగువారికి ఇంకా బాగా దగ్గరయ్యారు. వర్ష బొల్లమ్మ కాసేపే కనిపించినా తన రోల్‌ పర్ఫెక్ట్ గా చేశారు. ఒకమ్మాయిని నిజాయతీగా ప్రేమించిన అబ్బాయిగా శర్వానంద్ నటన సూపర్‌ ఫిట్‌. జీవితంలో ఎవరికి వారుగా విడిపోయిన ప్రేమికులు కొద్ది సేపు కలిసి గడిపే అవకాశం వచ్చినప్పుడు, తమ ప్రేమ ఊసులను ఎంత పవిత్రంగా కలబోసుకోవచ్చో ఎమోషనల్‌గా చెప్పిన సబ్జెక్ట్ ఇది. వాట్సాప్‌ గ్రూపుల్లో ఎవరైనా కొత్తగా యాడ్‌ అయితే, మిగిలిన వారు ఎలా మాట్లాడుతారు? ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి సరదా సన్నివేశాలుంటాయి? అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ పుడితే, దాని తాలూకు ప్రభావం వారి ప్రవర్తనపై ఎలా ఉంటుంది? వంటి చాలా అంశాలను సున్నితంగా చూపించారు. కాపలా దేవుడి పాత్రలో రఘుబాబుకు చాలా రోజుల తర్వాత మంచి రోల్‌ పడింది. సెలూన్‌ బాబాయ్‌గా తనికెళ్ల భరణి పక్కా యాప్ట్. హోటల్‌ రూమ్‌లో ఒకరిగురించి ఒకరు తెలుసుకునే సన్నివేశాల నుంచి కథ స్పీడందుకుంటుంది. త్రిష – సమంత మధ్య పాత్రల్లో కనిపించే సూపర్‌ కెమిస్ట్రీ ఇక్కడ కూడా రీక్రియేట్‌ అయింది. ఎయిర్‌పోర్టు సన్నివేశాలు గుండెల్ని బరువెక్కిస్తాయి. ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచ్‌లు వాట్సాప్‌ గ్రూప్‌లు ఉండటం ఇప్పుడు కామన్‌. ఎక్కడెక్కడో ఉన్నవారు అప్పుడప్పుడూ కలవాలని రీ యూనియన్‌ పార్టీలు చేసుకోవడం కూడా కామన్‌. అయితే ఆ రీయూనియన్‌లో కలుసుకున్న ఓ జంట తాలూకు పాత జ్ఞాపకాలు, వాళ్ల ప్రస్తుత పరిస్థితులను చెప్పడం ‘జాను’లో ప్రత్యేకత. ప్రముఖ గాయని జానకి పాడిన పాటలను ఎంపిక చేసుకున్న తీరు కూడా బావుంది. అయితే కొన్ని సందర్భాల్లో సన్నివేశాలు అత్యంత నిదానంగా సాగుతాయి. ఇదివరకు తమిళ సినిమాను చూసిన వారికి ఇక్కడ కొత్తగా థ్రిల్‌ అనిపించే అంశాలేమీ ఉండవు. పైగా అడుగడుగునా ఆ సినిమాతో పోలిక మొదలవుతుంది. దాంతో ఇంట్రస్ట్ తగ్గే ప్రమాదం ఉంది. అక్కడక్కడా తప్పితే, చాలా వరకూ నెమ్మదిగా సాగే ఈ సినిమా మాస్‌ను ఎంత వరకు అట్రాక్ట్ చేస్తుందో తెలియాలంటే వెయిట్‌ చేయాల్సిందే. ఫైనల్‌గా… ’96’కి సెల్ఫ్‌ అటెస్టెడ్‌ జెరాక్స్ కాపీ ‘జాను’ – డా. చల్లా భాగ్యలక్ష్మి

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో