స్వచ్ఛభారత్‌లో తెలంగాణకు అవార్డుల పంట
స్వచ్ఛ మహోత్సవ్-2019లో తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో తెలంగాణకు 5 అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను అందజేశారు. పెద్దపల్లి జిల్లా దక్షిణాదిలో ప్రథమ స్థానం, జిల్లా స్థాయిలో మూడో స్థానాన్ని కౌవసం చేసుకుంది. ప్రత్యేక వ్యక్తిగత విభాగాల్లో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వాసి భిక్షపతి, జగిత్యాల జిల్లా శాంతక్కపల్లి వాసి రమను అవార్డులు […]
స్వచ్ఛ మహోత్సవ్-2019లో తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో తెలంగాణకు 5 అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను అందజేశారు. పెద్దపల్లి జిల్లా దక్షిణాదిలో ప్రథమ స్థానం, జిల్లా స్థాయిలో మూడో స్థానాన్ని కౌవసం చేసుకుంది. ప్రత్యేక వ్యక్తిగత విభాగాల్లో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వాసి భిక్షపతి, జగిత్యాల జిల్లా శాంతక్కపల్లి వాసి రమను అవార్డులు వరించాయి. ఇక రాష్ట్ర స్థాయిలో పంచాయతీ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, జిల్లా స్థాయిలో పెద్దపల్లి కలెక్టర్ దేవసేన అవార్డులు అందుకున్నారు. జిల్లాల ప్రత్యేక విభాగంలో వరంగల్ అవార్డును కైవసం చేసుకుంది.