నేటి నుంచీ స్కూళ్లు, కాలేజీలు రీ స్టార్ట్..విద్యార్థులకు సమస్యలు తప్పవా..?

నేటి నుంచీ స్కూళ్లు, కాలేజీలు రీ స్టార్ట్..విద్యార్థులకు సమస్యలు తప్పవా..?

దసరా సెలవులకు మూతపడిన స్కూళ్లు మళ్లీ ఇవాళ తెరచుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవలను తెలంగాణ సర్కార్ కొన్ని రోజులు ఎక్ట్సెండ్ చేసింది. స్కూళ్లు 14న మొదలవ్వాల్సి ఉన్నా… సమ్మె జరగడంతో… 19 వరకూ సెలవుల్ని పెంచింది. 20న ఆదివారం కావడంతో… మొత్తం 23 రోజులు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. సెలవలు కంప్లీట్ అయిపోవడంతో.. ఈ రోజు స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి.  ఇన్ని రోజులూ స్కూల్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం… ప్రయాణికుల కోసం వాడుకుంది. వాటిలో […]

Ram Naramaneni

| Edited By:

Oct 21, 2019 | 11:48 AM

దసరా సెలవులకు మూతపడిన స్కూళ్లు మళ్లీ ఇవాళ తెరచుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవలను తెలంగాణ సర్కార్ కొన్ని రోజులు ఎక్ట్సెండ్ చేసింది. స్కూళ్లు 14న మొదలవ్వాల్సి ఉన్నా… సమ్మె జరగడంతో… 19 వరకూ సెలవుల్ని పెంచింది. 20న ఆదివారం కావడంతో… మొత్తం 23 రోజులు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. సెలవలు కంప్లీట్ అయిపోవడంతో.. ఈ రోజు స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి.  ఇన్ని రోజులూ స్కూల్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం… ప్రయాణికుల కోసం వాడుకుంది. వాటిలో డ్రైవర్లను కూడా తీసుకుంది. కానీ… ఇవాళ స్కూళ్లు తెరచుకోవడంతో… దాదాపు 1000 స్కూల్ బస్సులు తిరిగి స్కూళ్లకు వెళ్లిపోయాయి. వాటిలో డ్రైవర్లు కూడా… స్కూళ్లకు చేరుకున్నారు.

అందువల్ల ఇవాల్టి నుంచీ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులకు మరింత కొరత ఏర్పడనుంది. దీని వల్ల ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో చాలా మంది స్కూల్, కాలేజీ పిల్లలు సైతం… ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. ఇప్పుడు వాళ్లంతా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం ఎలా అన్న సమస్య తలెత్తుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు వెళ్లే పిల్లలు ఎక్కువ సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉంది. ఇక సిటీల్లో  సమయానికి బస్సులు దొరక్క ఇబ్బంది పడటం ఒక సమస్యైతే… తమ పాస్‌లను అనుమతిస్తారో లేదో అనే సమస్య కూడా ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu