బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం..అక్కడే ఎందుకు ఇలా..?

బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అమ్మవారికి భక్తులు ప్రేమతో చీరలు సమర్పించుకోవడం ఇక్కడ అనవాయితీ అన్న విషయం తెలిసిందే.  వాటిలో పట్టు చీరలు కూడా ఉండంటంతో కొంతమంది ప్రబుద్దులు ఆశతో దారితప్పారు. పట్టు చీరల్లో జునియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం చేతివాటం ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించారు. భక్తులు సమర్పించిన ఖరీదైన పట్టు చీరల స్థానంలో… వేరే చీరలు మార్చినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అమ్మవారి చీరల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో… దేవాదాయ […]

బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం..అక్కడే ఎందుకు ఇలా..?

బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అమ్మవారికి భక్తులు ప్రేమతో చీరలు సమర్పించుకోవడం ఇక్కడ అనవాయితీ అన్న విషయం తెలిసిందే.  వాటిలో పట్టు చీరలు కూడా ఉండంటంతో కొంతమంది ప్రబుద్దులు ఆశతో దారితప్పారు. పట్టు చీరల్లో జునియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం చేతివాటం ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించారు. భక్తులు సమర్పించిన ఖరీదైన పట్టు చీరల స్థానంలో… వేరే చీరలు మార్చినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అమ్మవారి చీరల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో… దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ ఆలయంలోని చీరల గోదాములో విచారణ చేపట్టారు.

దాదాపు రూ.11 లక్షల 60 వేల వరకు గోల్​మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. పట్టు చీరల విషయంలోనే కాకుండా… ముక్కల చీరలతో గుడ్డ సంచులు కుట్టించడంలోనూ సుబ్రహ్మణ్యం తన దుర్బుద్దిని ప్రదర్శించినట్టు సమాచారం. దీంతో అతడిని విధుల నుంచి తప్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దుర్గగుడి పూర్వపు ఈవో కొటేశ్వరమ్మ వద్ద సుబ్రహ్మణ్యం సీసీగా పనిచేశారు. కాగా పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇటువంటివి పదే, పదే జరుగుతుండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తున్నారు.